గార: ప్రభుత్వ డైట్, ప్రైవేటు డీఈడీ కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించి డీ సెట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమైందని వమరవల్లి ప్రభుత్వ డైట్ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ ఎ.గౌరిశంకరరావు ఒక ప్ర కటనలో పేర్కోన్నారు. డీసెట్‌లో అర్హత సాధించిన ర్యాంకు హోల్డర్లు ఈ నెల 15వ తేదీ వరకు తామ ప్రవేశం కోరుకునే కళాశాలలను ప్రాధాన్యత క్రమంలో వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలని సూచించారు. 16వ తేదీన సీట్ల కేటాయింపు జరుగుతుంది. 19 నుంచి 23వ తేదీ వరకు డైట్‌లో సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుంది. ఈ నెల 25వ తేదీ నుంచి విద్యార్థులకు తరగతులు ప్రారంభమవుతాయన్నారు.
జిల్లా వైద్యారోగ్య శాఖాధికారిగా డాక్టర్ నరేష్‌కుమార్
అరసవల్లి: జిల్లా వైద్యారోగ్య శాఖాఽధికారిగా డాక్టర్ ఈవీ నరేష్‌కుమార్ నియ మితులయ్యారు. ఈ మేరకు సోమ వారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈయన విశాఖ జీవీఎంసీలో వైద్యాధికారిగా పనిచేస్తూ బదిలీ అయ్యారు. కాగా ఇప్పటివరకు స్థానిక జిల్లాలో జీజీహెచ్ ఆర్‌ఎంఓగానూ అలాగే డీఎంహెచ్‌ఓగా కూడా విధుల్లో ఉన్న డాక్టర్ కె.అనితకు కాకినాడ జిల్లా వైద్యశాఖాధికారిగా బదిలీ అయ్యింది. మంగళవారం కొత్త డీఎంహెచ్‌ఓ బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయి.
నవోదయలో ప్రవేశాలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2027–28 విద్యాసంవత్సరానికి గాను ఆరో తరగతిలో ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు కలెక్టర్, నవోదయ విద్యాలయ కమిటీ చైర్మన్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు నవోదయ విద్యాలయ సమితి అధికారిక వెబ్‌సైట్ (www. navodaya.gov.in లేదా http://cbreitmr.rci .gov.in/ nvr/) ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జూలై 31 ఆఖరు తేదీ అని నవంబర్ 28న ప్రవేశ పరీక్ష ఉంటుందని వివరించారు.
‘గిరిజనులకు ‘అన్నదాత సుఖీభవ’ అందడం లేదు’
పాతపట్నం: పోడు పట్టాలతో గిరిజనులు పంటలు పండించుకుంటున్నామని, పండించిన పంటలకు యూరియా, అన్నదాత సుఖీభవ పథకాలు తమకు ఇప్పించాలని భగంతర, బురికిపేట, రంకిణి గ్రామాలకు చెందిన గిరిజనులు దిమిలి రత్నాలమ్మ, దిమిలి శాంతమ్మ, లాబర సుశీల, చిన్మమ్మడు కోరారు. ఈ మేరకు సోమవారం సీతంపేట ఐటీడీఏ పీఓ పవర్ స్వప్నిల్ జగన్నాథ్‌కు గిరిజనులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గిరిజనులు మా ట్లాడుతూ గత ప్రభుత్వంలో పోడు పట్టాలు అందించారని, పంటలు పండించుకుని జీవనం సాగిస్తున్నామన్నారు. గతంలో అన్నదాత సుఖీభవ , యూరియా ఇచ్చేవారని, ఇప్పుడు రావడం లేదన్నారు. ఇప్పుడు 1బిలు కూడా రావడం లేదన్నారు. ఇప్పటికై న అధికారులు స్పందించి తమకు యూరియా, అన్నదాత సుఖీభవ ఇప్పించాలని కోరుతున్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో జన్ని లక్ష్మి, జ్యోతి, శారద, ఆఫీసమ్మ, పార్వతి, కరునమ్మ తదితరులు ఉన్నారు.
మహిళ ఆత్మహత్య కేసులో నలుగురికి రిమాండ్
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని ఆదివారంపేటలో వివాహిత షర్మిల ఆత్మహత్యకు కారణమైన అత్తింటిలో నలుగురినీ రిమాండ్‌కు తరలించినట్లు సీఐ పి.ఈశ్వరరావు సోమవారం వెల్లడించారు. రిమాండ్‌కు వెళ్లిన వారిలో షర్మి ల అత్తమామలు దమయంతి, రామారావు, భర్త నాగరాజు, మరిది తేజేశ్వరరావు ఉన్నారు.
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): దస్తావేజు లేఖరుల పొట్టకొట్టే జీఓ నంబర్ 396కి వ్యతిరేకంగా ఈ నెల 20 నుంచి 30వ తేదీ వరకు పెన్‌డౌన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు దస్తావేజు లేఖరుల సంఘ నాయకులు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఐకమత్యంతో పెన్ డౌన్ కార్యక్రమం చేసి మన జీవన భృతిని కాపాడుకోవాలని కోరారు.


