ఎమర్జింగ్‌ క్రికెట్‌ టోర్నీకి విజయ్‌ | - | Sakshi
Sakshi News home page

ఎమర్జింగ్‌ క్రికెట్‌ టోర్నీకి విజయ్‌

Jul 7 2026 1:43 AM | Updated on Jul 7 2026 1:43 AM

జిల్లా నుంచి ఈ అవకాశం దక్కించుకున్న మొదటి క్రికెటర్‌గా గుర్తింపు

బెంగళూరు వేదికగా ఈనెల 24 వరకు జరగనున్న ప్రతిష్టాత్మక పోటీలు

త్రిపురాన

విజయ్‌

శ్రీకాకుళం న్యూకాలనీ: త్రిపురాన విజయ్‌.. ఐపీఎల్‌ ఎంట్రీతో జిల్లా పేరును మార్మోగించిన క్రికెటర్‌. టెక్కలికి చెందిన ఈ యువ ఆల్‌రౌండర్‌ మరో మరో అద్భుతమైన అవకాశాన్ని దక్కించుకున్నాడు. బీసీసీఐ ఆధ్వర్యంలో బెంగళూరు వేదికగా జరగనున్న ఎమర్జింగ్‌ మెన్స్‌ క్రికెట్‌ టోర్నీకి ఎంపికయ్యాడు. జూనియర్లు, సీనియర్‌ క్రికెటర్లతో కలబోసిన ఈ మెగా టోర్నీలో బీసీసీఐ ప్రకటించిన ఇండియా– బీ టీమ్‌లో విజయ్‌ చోటు దక్కించుకున్నాడు. ఈ మేరకు సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌ లెన్స్‌ బెంగళూరు హెడ్‌ కోచ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ నుంచి ఏసీఏ సెక్రటరీకి వర్తమానం అందింది. ఐపీఎల్‌లో గత రెండు పర్యాయాలు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన ఈ సిక్కోలు తెలుగు తేజం ఈ టోర్నీ కోసం ఇప్పటికే బెంగళూరు చేరుకున్నాడు. ఈ ఫీట్‌ సాధించిన జిల్లా మొట్టమొదటి క్రికెటర్‌గా గుర్తింపు అందుకున్నాడు. ఎమర్జింగ్‌ మెన్స్‌ క్రికెట్‌ టోర్నీకి విజయ్‌ ఎంపికపై జిల్లా క్రికెట్‌ సంఘం పెద్దలు, ప్రతినిధులు, కోచ్‌లు, సీనియర్‌ క్రికెటర్లు, విజయ్‌ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంతోషంగా ఉంది

ఎమర్జింగ్‌ మెన్స్‌ క్రికెట్‌ టోర్నీకి ఎంపిక కావడం సంతోషంగా ఉంది. నాలాంటి జూనియర్స్‌తోపాటు సీనియర్‌ క్రికెటర్లుతో కూడిన ఈ మెగా టోర్నీ ఈనెల 24 వరకు జరుగుతుంది. ఇండియా–బీ జట్టుకు ఎంపికచేశారు. అవకాశం లభిస్తే రాణించేందుకు సర్వశక్తులా ఒడ్డుతాను. నాకు అన్ని విధాలుగా సహకరిస్తున్న క్రికెట్‌ సంఘ పెద్దలు, కోచ్‌లు, తల్లిదండ్రులకు రుణపడి ఉంటాను.

– త్రిపురాన విజయ్‌, క్రికెటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement