పాతపట్నం: మండలంలోని చిన్నలోగిడి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ దయానిధి సోయి(30) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చిన్నలోగిడి గ్రామానికి చెందిన దయానిధి సోయి ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఆశ కార్యకర్త జైనవలస చిలకమ్మకు రూ.3 లక్షలు అప్పు ఇచ్చాడు. చిలకమ్మకు ఐదు రోజుల క్రితం డబ్బులు అడగగా.. చిలకమ్మ, ఆమె భర్త ముఖలింగంలు కలిసి పోలీసుస్టేషన్‌లో దయానిధిపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. దయానిధి సోయిని పోలీసు స్టేషన్‌కు పిలిపించారు. స్టేషన్‌లోనే దయానిధి సోయిని చిలకమ్మ ధూషించింది. దీంతో మనస్తాపం చెందిన ఆయన ఈనెల 10వ తేదీన గడ్డిమందు తాగాడు. అనంతరం ఆటోలో సెల్ఫీ వీడియో తీశాడు. తన మృతికి పెద్దలోగిడి ఆశ వర్కర్ జైనవలస చిలకమ్మ, ఆమె భర్త మొఖలింగంలు కారణమని, అప్పు ఇచ్చిన డబ్బులు అడిగితే తనపై కేసు పెట్టారని వాపోయాడు. వీడియోని చూసిన గ్రామస్తులు, కుటుంబ సభ్యులు దయానిధిని పాతపట్నం సీహెచ్‌సీకి తరలించగా, అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తీసుకెళ్లారు. రిమ్స్‌లో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. రిమ్స్‌లో పంచనామా , పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఫిర్యాదు మేరకు ఏఎస్‌ఐ కె.శ్రీరామమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
హిరమండలంలో చోరీ
హిరమండలం: హిరమండలం మేజర్ పంచాయతీ దేవరశెట్టి వీధిలోని అందవరపు కస్తూరి ఇంట్లో శనివారం తెల్లవారుజామున దొంగతనం జరినట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే కొత్తూరు సీఐ సీహెచ్ ప్రసాదరావు, హిరమండలం, కొత్తూరు ఎస్‌ఐలు వై.మధుసూదనరావు, కె.వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా కేంద్రం నుంచి క్లూస్ బృందం, జాగిలాలను తెప్పించారు. ఇంటి యాజమాని అందవరపు కస్తూరి పొలాకిలోని తన కన్నవారింటికి వెళ్లడంతో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. చోరీ సంఘటనపై కొత్తూరు సీఐ వద్ద ప్రస్తావించగా దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు.


