
● కూలిన ప్రసాదాల విక్రయ శాల
శ్రీకాకుళంలోని పాత బ్రిడ్జి వద్ద నాగావళి పరవళ్లు
అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయం ముందు ఆదివారం వంటి పర్వదినాల్లో భక్తులకు ప్రసాదాలను విక్రయించే జింకు పైపుల శాల ఒక్కసారిగా కూలిపోయింది. భారీ వర్షం కారణంగా శాలపై వేసిన పై కప్పుపై అధికంగా వర్షపునీరు నిలిచిపోవడంతో పాటు గాలులకు పైపులన్నీ వంగిపోయి పైకప్పు కుంగిపోవడంతో మొత్తం శాల (షెడ్) కూలిపోయింది. అయితే ఆ సమయంలో భక్తులెవ్వరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అయితే ఈమేరకు పునర్నిర్మాణ చర్యలు చేపట్టాలని ఆలయ ఈఓ కేఎన్‌వీడీవీ ప్రసాద్ ఆదేశించారు. ఈ మేరకు పనులు సోమవారం సాయంత్రం నుంచి మొదలయ్యాయి. –అరసవల్లి

● కూలిన ప్రసాదాల విక్రయ శాల