
అవినీతికి పాల్పడితే వేటు తప్పదు
అర్ధవార్షిక నేర సమీక్షలో విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి
అరసవల్లి: జిల్లాలో పోలీస్ శాఖలో చాలా మంది అధికారులపై అవినీతిపై ఫిర్యాదులు వస్తున్నాయని, అలాంటి వారిపై వేటు తప్పదని విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి హెచ్చరించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన అర్ధవార్షిక నేర సమీక్షలో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా తో పాటు ఎస్పీ కెవి మహేశ్వరరెడ్డి సమక్షంలో జరిగిన ఈ సమీక్షలో జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న సంఘటనలు, దర్యాప్తు జరుగుతున్న తీరుతెన్నుల పై ఆయన ఆరా తీశారు. జిల్లాలో దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ గంజాయి కేసులు, సైబర్ మోసాలు నమోదవుతున్నాయని, నియంత్రణకు నిఘా చర్య లు చేపట్టాలన్నారు. స్టేషన్లకు వచ్చిన బాధితులతో మర్యాదపూర్వకంగా మాట్లాడేలా సిబ్బంది వ్యవహరించాలన్నారు. ప్రాపర్టీ నేరాల నియంత్రణకు రాత్రి వేళల్లో గస్తీలు పెంచాలని సూచించారు.
●కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ జిల్లాలో నేరాల సంఖ్యను నియంత్రించేలా శాఖాధికారులు శ్రద్ధ వహించాలని, అలాగే పాఠశాలల్లో, వసతి గృహాల్లో ప్రతి శనివారం విద్యార్థులతో పోలీసులు మమేకమై గుడ్‌టచ్–బ్యాడ్ టచ్‌లపై అవగాహన కలిగించేలా కార్యక్రమాలను చేపట్టాలన్నారు.
●జిల్లా ప్రధాన న్యాయమూర్తి అహ్మద్ మౌలానా మాట్లాడుతూ కొత్తగా వచ్చిన చట్టాలపై అవగాహ న పెంచుకోవాలన్నారు. కేసుల దర్యాప్తుల్లో ఎదుర య్యే లీగల్ సమస్యలు, నేరప్రవృత్తి, నేర తరహా వంటి పలు అంశాలపై పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో చ ర్చించాలని సూచించారు.
●ఎస్పీ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో చాలావరకు నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. జిల్లాలో విజిబుల్ పోలీసింగ్, నైట్ పోలీసింగ్, ట్రా ఫిక్ నియంత్రణకు కూడా పక్కా చర్యలు చేపట్టడంతో శాఖాపరంగా పురోగతి సాధించామన్నారు.