
విరుగుడు కనిబెట్టాల్సిందే..!
మొదట సరదాగానే మొదలవుతుంది. కొన్నాళ్లకు అలవాటుగా మారుతుంది. అలవాటు కాస్తా వ్యసనమైపోతుంది. ఆ వ్యసనమే మనిషిని బానిసగా మార్చేసి ప్రాణాలు సైతం బలికొంటుంది. ఆన్‌లైన్ బెట్టింగ్ అత్యంత ప్రమాదకారి. జిల్లాలోనూ ఈ మహమ్మారి బారిన పడి యువత ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉండడమే వారి తప్పైపోయింది. ఈ జాడ్యాన్ని వదిలించేందుకు కేంద్రం లోక్‌సభలో ఇటీవలే ఆన్‌లైన్ బెట్టింగ్ నేరమనే బిల్లుకు ఆమోదం తెలిపింది. బిల్లుతో పాటు ఈ జాడ్యాన్ని వదిలించే విరుగుడు కూడా కనిబెట్టాల్సిందే.
●ఆన్‌లైన్ బెట్టింగ్ నేరంగా లోకసభలో బిల్లు ●జిల్లాలోనూ కనిపిస్తున్న జాడ్యం●వ్యసనం వదిలించుకోకపోతే ప్రాణాలకే ప్రమాదం
●నిర్వాహకులకు మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ. కోటి జరిమానా చెల్లించాలి. కొన్నిసార్లు ఈ రెండు శిక్షలూ అనుభవించాలి.
●మనీ గేమ్‌లను ప్రచారం చేస్తే (ప్రమోటర్లకు) రెండేళ్ల జైలు శిక్ష లేదా రూ. 50 లక్షలు జరిమానా ఉంటుంది. ఈ రెండూ విధించే సందర్భాలూ ఉంటాయి.
●నగదు బదిలీలకు సహకరిస్తే మూడేళ్ల జైలు లేదా రూ. కోటి జరిమానా తప్పదు. కొన్ని సందర్భాల్లో రెండింటికీ ఆస్కారముంది.
●నిర్వాహకులు మళ్లీ మళ్లీ పట్టుబడితే 3 నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ. 2 కోట్ల వరకు జరిమానా కట్టాల్సిందే.
●నిందితులపై నాన్‌బెయిల్‌బుల్ కేసులు తప్పవు. వారెంట్ లేకుండానే అరెస్టు చేసి పోలీసులు విచారించవచ్చు.
పెను ప్రమాదంలా పరిణమించిన ఆన్‌లైన్ బెట్టింగ్‌ను అరికట్టడం సవాల్‌తో కూడుకున్న వ్యవహారమే. పోలీసులతో పాటు అన్నివర్గాల ప్రజలు ఓ యజ్ఞంలా భావించి భాగస్వాములై అరికట్టాలి. ఆన్‌లైన్ గేమింగ్‌ను నేరంగా భావించి, భారీ జరిమానాలు, శిక్షలతో రూపొందించేలా లోక్‌సభలో బిల్లును ఆమోదించేలా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అభినందనీయం.
– డాక్టర్ ఎం.ప్రదీప్, హెచ్‌ఓడీ బయోటెక్నాలజీ, ప్రభుత్వ పురుషుల డిగ్రీకళాశాల, శ్రీకాకుళం
జిల్లాలో ఎస్పీ పర్యవేక్షణలో ఆన్‌లైన్ బెట్టింగ్‌పై ఉక్కుపా దం మోపాం. మేలో జరిగి న ఓ కేసులో 8 మందిని గుర్తించి, 15 మందిని సాక్షు లుగా చేర్చాం. కేంద్ర ప్రభు త్వం లోక్‌సభలో ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు–2025 ప్రవేశపెట్టడం హర్షించదగ్గ విషయం.
– సీహెచ్ వివేకానంద, డీఎస్పీ, శ్రీకాకుళం
శ్రీకాకుళం క్రైమ్ :
జిల్లాలో ఆన్‌లైన్ బెట్టింగ్‌రాయుళ్లు పెరిగిపోతున్నారు. ఇంటి పరిస్థితులు గమనించకుండా, తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులపై ఏమాత్రం అవగాహన లేకుండా ఇష్టానుసారం పందాలు కాస్తున్నా రు. లక్షలకు లక్షలు అప్పు చేసి నిండా మునిగిపోయి ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. ఈ ఏడాది మేలో జిల్లా కేంద్రంలో ఎస్పీ మహేశ్వరరెడ్డి పర్యవేక్షణలోని టాస్క్‌ఫోర్స్ పోలీసులు బెట్టింగ్ మాఫియా గుట్టు రట్టు చేశారు. శ్రీకాకుళం రూరల్, ఎచ్చెర్ల పోలీసులు సుమారు ఎనిమిది నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. ఇదే కేసులో మరో 15 మంది ఆడినవారిని (బాధితులు) సాక్షులుగా మార్చా రు. న్యాయమూర్తి ఒక్కరోజు రిమాండ్ విధించి బెయిల్ ఇవ్వడంతో వారంతా బయటకు వచ్చేశారు. నేరం రుజువైతే వీరికి దాదాపు ఒక నెల నుంచి ఆరునెలల్లోపు జైలు శిక్ష పడే వీలుంది. లేదంటే మొదటిసారి పట్టుబడితే రూ .500 జరిమానాతో బయటపడతారు. మళ్లీ మళ్లీ పట్టుబడితే రూ. 1 వేయి నుంచి రూ. 3 వేల వరకు పెంచుకుంటూ పోతారు. కానీ తాజాగా లోక్‌సభలో ఓ బిల్లు ఆమోదం పొందింది. ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు –2025 ఆచరణలోకి వచ్చిందంటే ఇక ఈ ఆటలు కుదరవు. నిర్వాహకుల కు, నగదు లావాదేవీలు జరిపే బ్యాంకులకు, బుకీలకు, ప్రమోటర్లకు నేరంలో వారి పాత్ర, ప్రా ధాన్యత అనుసరించి రెండేళ్ల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్షతోపాటు రూ. 50 లక్షల నుంచి రూ. 2 కో ట్ల భారీ జరిమానా కూడా విధించే అవకాశం ఉంది.
●గత నెల 16న హిరమండలంలో ఓ యువకుడు ఆన్‌లైన్ గేమ్స్‌లో నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నాడు.
●శ్రీకాకుళం గారవీధిలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బెట్టింగ్ ఆడి రూ. కోటి పోగొట్టుకుని తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
●మార్చిలో పలాస డివిజన్ పరిధిలో ఓ యువకుడు ఆన్‌లైన్‌లో అప్పులు వాడి అవి తీర్చలేక సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోయాడు. అతడు మూడేళ్లుగా లోన్ యాప్‌లు వాడుతూ టార్చర్ భరించలేకపోయాడు.
●ఈ ఏడాది ఏప్రిల్‌లో సారవకోటకు చెందిన ఇద్దరు సోదరులు ఒకరికి తెలియకుండా మరొకరు బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకుని రూ. లక్షల్లో మోసపోయి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరిలో ఒకరు మృతిచెందారు.
●జలుమూరు మండలంలో ఓ రాజకీయ వేత్త క్రికెట్ బెట్టింగ్ కాస్తూ అధిక వడ్డీలకు అప్పులపాలై దాదాపు రూ. 7 కోట్ల వరకు ఐపీలు పెట్టి పరారయ్యాడు. ఆరునెలలకు గానీ తిరిగి రాలేదు.
●ఆన్‌లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌తో పాటు ఆన్‌లైన్ ఫ్యాంటసీ స్పోర్ట్స్, ఆన్‌లైన్ లాటరీలు నిషేధం. డబ్బులు పెట్టి ఆన్‌లైన్‌లో ఆడే క్రీడలపై నిషేధం అమలవుతుంది.
●ఆన్‌లైన్ గేమ్‌లను ప్రచారం చేసే వారూ నేరస్తులవుతారు. గేమ్‌లో భాగంగా ఒకరి నుంచి మరొకరికి ఆన్‌లైన్‌లో నగదు బదిలీలకు వీలు కల్పించే బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలను శిక్షిస్తారు.
●ఏ రూపంలో బెట్టింగ్‌లు నిర్వహించినా, ప్రోత్సహించినా, ప్రచారం చేసినా నేరమే. అంటే కంప్యూటర్ లేదా మొబైల్ ఫోన్ ద్వారా చేసినా, సోషల్ మీడియా లేదా పత్రికలు లేదా టీవీల్లో ప్రచారం చేసినా శిక్ష తప్పదు.
●గేమ్‌ల్లో పాల్గొన్నవారిని (ఆడేవారిని) దోషులు గా కాకుండా బాధితులుగానే పరిగణిస్తారు.

విరుగుడు కనిబెట్‌టాల్సిందే..!

విరుగుడు కనిబెట్‌టాల్సిందే..!

విరుగుడు కనిబెట్‌టాల్సిందే..!

విరుగుడు కనిబెట్‌టాల్సిందే..!

విరుగుడు కనిబెట్‌టాల్సిందే..!

విరుగుడు కనిబెట్‌టాల్సిందే..!

విరుగుడు కనిబెట్టాల్సిందే..!