
ఐటెప్ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్
ఎచ్చెర్ల : నాలుగేళ్ల సమీకృత విద్యా కార్యక్రమం (ఐటెప్) కోర్సుల్లో ప్రవేశాలకు శుక్రవారం ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్.విశ్వవిద్యాలయంలో కౌన్సెలింగ్ ప్రారంభించారు. మొత్తం 110 సీట్లకు గాను బీఎస్సీ బీఈడీ, కేటగిరీలో 53 సీట్లు, బీఏ బీఈడీలో 27 సీట్లు భర్తీ అయ్యాయి. వర్శిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.అనురాధ పర్యవేక్షణలో అకడమిక్ అఫైర్స్ డీన్ డాక్టర్ కె.స్వప్నవాహిణి, విద్యావిభాగం సమన్వయకర్త డాక్ట ర్ జి.ఎల్.సంధ్యారాణి విద్యార్థుల ధ్రువపత్రాలను పరిశీలించారు. అసిస్టెంట్ ప్రిన్సిపాల్ డాక్టర్ హెచ్.సుబ్రహ్మణ్యం, సిబ్బంది పాల్గోన్నారు. శనివారం కూడా కౌన్సెలింగ్ కొనసాగనుంది.