
వినాయక మండపం పెడుతున్నారా..?
అనుమతులు తప్పనిసరి
గణనాథుని మండపాల అనుమతులకు సింగిల్ విండో సిస్టమ్
ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి
శ్రీకాకుళం క్రైమ్ : వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా మండపాలను ఏర్పాటు చేసుకునేందుకు రాష్ట్ర పోలీస్ శాఖ ప్రత్యేకంగా హెచ్‌టీటీపీఎస్:జిఎఎన్‌ఈస్‌హెచ్‌యూటీఎస్‌ఎవి.ఎన్‌ఇటీ అనే ఆన్‌లైన్ వెబ్‌సైట్ ద్వారా సింగిల్ విండో విధానం ప్రవేశపెట్టిందని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. గురువారం ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన వెంటనే సంబంధిత పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌ఓకు చేరాక పురపాలక, అగ్నిమాపక, విద్యుత్ శాఖల సిబ్బంది ఓ బృందంగా ఏర్పడి ఆ ప్రదేశాన్ని పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తారన్నారు. వెబ్‌సైట్‌లో అప్లికేషన్ స్టేటస్‌లో దరఖాస్తుదారుని ఫోన్ నంబర్ ఎంటర్ చేస్తే నో అబ్జక్షన్‌కు సంబంధించి నిబంధనలతో కూడిన క్యూఆర్‌కోడ్ డౌన్‌లోడ్ అవుతుందని, నో అబ్జక్షన్ సర్టిఫికెట్ తక్షణమే మంజూరవుతుందన్నారు.