
గణపతి దేవా.. మా గోడు వినవా..!
ఇబ్బందుల్లో మట్టి గణపతి విగ్రహాల తయారీదారులు
స్థలాభావం, వర్షాలతో ఇక్కట్లు
ప్రత్యేక షెడ్లు కేటాయించాలని వినతి
ప్రభుత్వాన్ని కోరాం..
షెడ్లు అవసరం..
శ్రీకాకుళం కల్చరల్ :
మట్టినే నమ్ముకుని దేవుడి విగ్రహాలు తయారు చేస్తూ జీవనోపాధి పొందుతున్న కళాకారులకు పలు సమస్యలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా వినాయక చవితి సందర్భంగా సంప్రదాయ మట్టి తో తయారు చేసే వినాయక విగ్రహాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే శ్రీకాకుళం మహిళా కళాశాల రోడ్డు లోని కుమ్మరివీధి, పెద్దమార్కెట్టు వెనుక ఉన్న కుమ్మరివీధి, బలగ ప్రాంతంలో కళాకారులు స్థలా భావ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా నలుమూలల నుంచి వినాయక కమిటీలు ఇక్కడి నుంచి విగ్రహాలను తీసుకెళ్తుంటాయి. అంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రాంతంలో వర్షాలు సమయంలో ఇబ్బందిపడకుండా విగ్రహాలను భద్రపరిచే అవకాశం లేకపోవడంతో కళాకారులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం.
వినాయక విగ్రహం తయారు చేసేందుకు అవసరమైన మట్టి, గడ్డి గతంలో ఉచితంగా లభ్యమయ్యేది. ఇప్పుడు వాటి లభ్యత తక్కువ కావడంతో కొను గోలు చేయాల్సి వస్తోందని తయారీదారులు చెబు తున్నారు. ప్రస్తుతం ట్రాక్టరు మట్టి కొనుగోలు చేయాలంటే రూ.2వేలు నుంచి రూ.3వేల వరకు ఖర్చు అవుతోంది. దానిపై గడ్డి రూ.వెయ్యి వసూలు చేస్తున్నారు. ఇంకా రంగుల కోసం ఖర్చు కలుపుకొ ని ఒక బొమ్మ తయారీకి రూ.500 నుంచి రూ.3 వేలు వరకు ఖర్చు అవుతోంది. దీనిపై వారు తయా రీ కూలి వేసుకొని అమ్మితే వారు పడిన కష్టానికి నష్టం లేకుండా ఉంటుంది. ఈ సీజన్‌లో కుటుంబ సభ్యులంతా తయారీలో పాలుపంచుకుంటారు.
బొమ్మలు చేసుకోడానికి స్థలం మంజూరు చేయాల ని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వచ్చే ఏడాదైనా ఈ అవకాశం కల్పించాలి. వర్షా లు వస్తే బొమ్మలను కాపాడుకోవడానికి నానా పాట్లు పడుతున్నాం. టార్పాలిన్ కప్పుకొని, అద్దె ఇళ్లలో ఉంచాల్సి వస్తోంది.
– వెంకటరావు, తయారీదారుడు, కుమ్మరివీధి, శ్రీకాకుళం
తాతముత్తాల నుంచి బొమ్మలు తయారు చేస్తున్నాం. 30 ఏళ్లుగా ఇదే వృత్తిలో ఉన్నాను. ఇంట్లో బొమ్మలు పెట్టడం వల్ల నిద్ర పోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ప్రభు త్వం మాకోసం ఈ మూడు నెలలకై నా ఒక చోట షెడ్లు కేటాయిస్తే బాగుంటుంది.
– పి.రాజేశ్వరరావు, విగ్రహ తయారీదారుడు, బలగ

గణపతి దేవా.. మా గోడు వినవా..!

గణపతి దేవా.. మా గోడు వినవా..!

గణపతి దేవా.. మా గోడు వినవా..!