
రెండు కేజీల గంజాయితో యువకుడు అరెస్టు
ఇచ్ఛాపురం: ఉత్తరప్రదేశ్‌కి చెందిన అనూజ్‌కుమార్ రెండు కేజీల గంజాయితో పట్టణ పోలీసులకు పట్టుబడిన ఇచ్ఛాపురం సీఐ మీసాల చిన్నంనాయుడు తెలిపారు. స్థానిక సర్కిల్ పోలీస్ కార్యాలయం ఆవరణంలో గురువారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఈ యువకు డు రేణిగుంటలో ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నా డు. ఒడిశాకు చెందిన గంజాయి సరఫరాదారుడు సాగర్‌తో పరిచయం ఏర్పడింది. రేణిగుంటలోనే గంజాయి వ్యాపారం చేసే అమిత్ జైస్వాల్ అలియా స్ అమిత్‌చౌదరితో గంజాయి సరఫరాకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 18న అనూజ్ ఒడిశాలో 2.070 కేజీల గంజాయిని కొనుగోలు ఇచ్ఛాపురం చేరుకున్నాడు. అనుమానాస్ప దంగా కనిపించడంతో పోలీసులు తనిఖీ చేయగా గంజాయి పట్టుబడింది. గంజాయి, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకొని అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించా రు. కార్యక్రమంలో పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి ఎస్సై రవివర్మ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.