
సమయం ఆసన్నమైంది
అంతరించిపోతున్న ప్రాచీన, సంప్రదాయ వస్త్ర తయారీ ప్రక్రియను బతికించేందుకు ఏఎఫ్‌కేకే సంఘం వడుకు, నేత ప్రక్రియలను నేర్పే శిక్షణా సంస్థగా అవతరించాల్సిన తరుణం ఆసన్నమైంది. ఆ మేరకు ఏఎఫ్‌కేకే సంఘం త్వరగా కేవీఐసీ సాయంతో శిక్షణలు ఇచ్చేందుకు భాగస్వామ్యం కోసం అడుగులు వేయాలి. పొందూరులో గతంలో 1,200 మంది స్పిన్నర్లు ఉండేవారు. ప్రస్తుతం వారి సంఖ్య 520 మందికి చేరింది. గతంలో 300 మంది నేత కార్మికులు ఉండేవారు. ప్రస్తుతం కేవలం 80 కుటుంబాలు మాత్రమే నేత కా
ర్మికులుగా మిగిలారు. ఏళ్లు గడుస్తున్న కొద్దీ కార్మికులు తగ్గిపోతున్న నేపథ్యంలో కొత్తవారు ఈ రంగంలోకి రావాల్సిన అవసరం ఏర్పడింది. దీనికోసం శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.