ఎందరో మహానుభావులు.. | - | Sakshi
Sakshi News home page

ఎందరో మహానుభావులు..

Aug 14 2025 6:53 AM | Updated on Aug 14 2025 6:53 AM

ఎందరో

ఎందరో మహానుభావులు..

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: స్వాతంత్య్ర పోరాటంలో మన జిల్లా నుంచి ఎంతో మంది పాల్గొన్నారు. వివిధ ఉద్యమాల్లో పాల్గొని స్వాతంత్య్రం రాకలో భాగస్వాములయ్యారు. వారిలో కొందరు ప్రముఖంగా నిలిచారు. వారిలో గరిమెళ్ల సత్యనారాయణ, గౌతు లచ్చన్న, చౌదరి సత్యనారాయణ, మార్పు పద్మనాభం, వీరగున్నమ్మ, స్వామిబాబు పొట్నూరు తదితరులు ఉన్నారు. వారి గురించి ఒక్కసారిగా స్మరించుకోవల్సిన అవసరం ఉంది.

చౌదరి సత్యనారాయణ

ఎచ్చెర్ల మండలం ఎస్‌ఎంపురానికి చెందిన చౌదరి సత్యనారాయణ 1921లో అప్పటి జాతీయ కాంగ్రెస్‌ పార్టీ సత్యాగ్రహ పిలుపు మేరకు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. 13వ ఏటనే స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న చౌదరి సత్యనారాయణ పోలీసుల లాఠీ దెబ్బలకు తీవ్ర గాయాలపాలై కోలుకోవడానికి 6 నెలల సమయం పట్టింది. సత్యాగ్రహం చేసిన సత్యనారాయణను బ్రిటీష్‌ పోలీసులు అరెస్టు చేయగా 6 నెలలు జైలు శిక్ష అనుభవించారు. 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమ ప్రచార కార్యక్రమం సందర్భంగా వచ్చిన గాంధీని దూసి రైల్వే స్టేషన్‌లో కలిసి పొందూరు ఖద్దరు పంచెను బహుకరించారు. 1942 క్విట్‌ ఇండియా ఉద్యమంలో కూడా అరైస్టె జైలు శిక్ష అనుభవించారు.

గరిమెళ్ల సత్యనారాయణ

స్వాతంత్రోద్యమ కవుల్లో గరిమెళ్ల సత్యనారాయణది విశిష్ట స్థానం ఉంది. గరిమెళ్ల గేయాలు పాఠక జనాన్ని ఉర్రూతలూగించాయి. అతను రాసిన మాకొద్దీ తెల్ల దొరతనం పాట సత్యాగ్రహులకు గొప్ప తెగువ, ఉత్తేజాన్ని కలిగించింది. దండాలు దండాలు భారత మాత అనే గీతం కూడా ప్రజలను జాగృతం చేసింది.

గౌతు లచ్చన్న

సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ తర్వాత సర్దార్‌ అనే గౌరవం పొందిన ఏకై క వ్యక్తి గౌతు లచ్చన్న. వి.వి.గిరి, నేతాజీ, జయంతి ధర్మతేజ తదితర జాతీయ నాయకులతో కలిసి భారత దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని జైలు కెళ్లారు. 1930లో ఉప్పు సత్యాగ్రహం జరిగిన సమయంలో లచ్చన్న ఇక్కడ ఉద్యమాన్ని నడిపారు. ఆ తర్వాత జరిగిన అనేక ఉద్యమాల్లో పాల్గొని జైలు కెళ్లారు.

మార్పు పద్మనాభం

మందస మండలంలోని భిన్నళ మదనాపురం గ్రామంలో జన్మించిన మార్పు పద్మనాభం 1930లో గాంధీజీ పిలుపు మేరకు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. తర్వాత జరిగిన ఉద్యమాల్లో కూడా పాల్గొన్నారు. పలు పర్యాయాలు జైలుకెళ్లారు. మందస కాల్పుల ఘటన తర్వాత ఆయనను అఖిత భారత కాంగ్రెస్‌ కమిటీ సర్దార్‌ బిరుదు ఇచ్చి సత్కరించింది. 1944లో జైలు నిర్బంధం నుంచి బయటికొచ్చిన తర్వాత ఉత్తరాంధ్రలో అరుణ పతాక ఆశయాలను ప్రచారం చేసి కట్టుబడిన తొలితరం కమ్యూనిస్టుగా చరిత్రలో నిలిచారు.

వీరగున్నమ్మ

బ్రిటిష్‌ ముష్కరుల చర్యలను ఎదిరించిన సామాన్య మహిళగా వీరగున్నమ్మ నిలిచారు. ఆంగ్లేయులతో పోరాటానికి సై అన్న ఽధీశాలి. రైతులు పండించే పంటలో మూడో భాగాన్ని కప్పం కింద ఆంగ్లేయులు వసూలు చేయడం, అటవీ ఉత్పత్తులను తెచ్చుకునేందుకు బ్రిటిష్‌ పోలీసులు అడ్డుకున్న సమయంలో రైతులకు, పోలీసుల మధ్య జరిగిన పోరాటంలో పోలీసుల తుపాకీ కాల్పుల తూటాలకు గురై మృతి చెందారు.

స్వామిబాబు పొట్నూరు

నరసన్నపేటకు చెందిన పొట్నూరు స్వామి దేశభక్తుడిగా, దాతగా, సంఘ సేవకుడిగా, కవిగా తనదైన ముద్ర వేసుకున్నారు. వందేమాతరం ఉద్యమంలో కుటుంబంతో కలిసి పాల్గొన్నారు. స్వరాజ్య ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్‌ ఇండియా ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.

కొత్తపల్లి పున్నయ్య

సోంపేట మండలం బారువలో జన్మించిన కొత్తపల్లి పున్నయ్య క్విట్‌ ఇండియా జాతీయోద్యమంలో పాల్గొన్నారు. భారత ప్రభుత్వం రాజ్యాంగ సమీక్షా సంఘంలో పున్నయ్యను సభ్యుడిగా నియమించారు.

జాతీయోద్యమంలో కీలక పాత్ర

పోషించిన సిక్కోలు ప్రముఖులు

ఎందరో మహానుభావులు.. 1
1/7

ఎందరో మహానుభావులు..

ఎందరో మహానుభావులు.. 2
2/7

ఎందరో మహానుభావులు..

ఎందరో మహానుభావులు.. 3
3/7

ఎందరో మహానుభావులు..

ఎందరో మహానుభావులు.. 4
4/7

ఎందరో మహానుభావులు..

ఎందరో మహానుభావులు.. 5
5/7

ఎందరో మహానుభావులు..

ఎందరో మహానుభావులు.. 6
6/7

ఎందరో మహానుభావులు..

ఎందరో మహానుభావులు.. 7
7/7

ఎందరో మహానుభావులు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement