
పోలీసుల అదుపులో నిందితులు..?
సాక్షి టాస్క్‌పోర్స్: పాతపట్నం మేజర్ పంచాయతీ మొండిగల వీధికి చెందిన నల్లి రాజు మృతదేహం ఈనెల 7వ తేదీన అనుమానాస్పద స్థితిలో దొరికిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు గత ఐదు రోజులుగా పలు కోణాల్లో దర్యాప్తు చేయడంతో కేసు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి పోలీసు అదుపులో నలుగురు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. వారిలో ఒక మహిళతో పాటు ముగ్గురు వ్యక్తులు ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
గంజాయితో ఇద్దరు అరెస్టు
టెక్కలి రూరల్: అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులను సోమవారం టెక్కలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టెక్కలి సీఐ ఎ.విజయ్‌కుమార్ తెలిపిన వివరాల మేరకు.. ఒడిశా రాష్ట్రం గుణుపూర్‌కు చెందిన విశాల్ కేశరి సమాల్, మూనలిమ్మ అనే ఇద్దరు వ్యక్తులు కొరాపుట్‌కు చెందిన ముఖేష్ బాగ్ అనే వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలు చేశారు. అనంతరం గుణుపూర్ నుంచి ట్రైన్‌లో టెక్కలి వచ్చి అక్కడి నుంచి విశాఖపట్నం వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ముందస్తు సమాచారం మేరకు సీఐ తన సిబ్బందితో కలిసి రైల్వేగేటు సమీపంలోని బాపినాయుడు కాలనీ వద్ద వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా వారి వద్ద నుంచి 9.25 కేజీల గంజాయి పట్టుబడింది. వీరు గోవాకు చెందిన వినాయక్ బాలచంద్ర చౌహాన్ అనే వ్యక్తికి ఈ గంజాయి అప్పగించేందుకు వెళ్తుండగా పట్టుబడ్డారు. వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
కిక్ బాక్సింగ్‌లో సత్తా
పొందూరు: మండలంలోని రాపాక గ్రామానికి చెందిన ఎచ్చెర్ల కీర్తన కిక్ బాక్సింగ్‌లో సత్తా చాటింది. ఈ నెల 10వ తేదీన విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ బాక్సింగ్ హాల్‌లో హెచ్‌సీజీ క్యాన్సర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో కిక్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో అండర్–10 బాలికల విభాగంలో కీర్తన ప్రతిభ కనపరిచి రెండో స్థానం కై వాసం చేసుకుంది. ఈ బాలికకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మెడల్, బహుమతులను సోమవారం శ్రీకాకుళంలో అందించారు. చిన్నారి ఎచ్చెర్ల గురుకులంలో 5వ తరగతి చదువుతోంది.

పోలీసుల అదుపులో నిందితులు..?