
బైకు అడ్డగించి దాడి
గార: మండలంలోని నిజామాబాద్ గ్రామానికి చెందిన బుగత రాజారావు సోమవారం తెల్లవారుజామున సతివాడ శివాలయానికి వెళ్లి వస్తుండగా కొందరు వ్యక్తులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాజారావు దర్శనం పూర్తి చేసుకొని బైక్‌పై వస్తుండగా సతివాడ జంక్షన్ సమీపంలో అదే గ్రామానికి చెందిన కాళ్ల వరాలు, కాళ్ల శేఖర్, మరో ఇద్దరు వ్యక్తులు కత్తి, కర్రలతో దాడి చేశారు. ఆ సమయంలో గుడికి వెళ్లేందుకు భక్తులు రావడం గమనించి వదిలేశారు. బాధితుడికి చెవి, ఎడమ కన్ను, ముఖంపై గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. గత రెండేళ్లుగా భూమి విషయంలో ఇరు కుటుంబాల మధ్య వివాదం నడుస్తోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ సీహెచ్ గంగరాజు తెలిపారు.