
పేకాట రాయుళ్లు అరెస్టు
పొందూరు: మండలంలోని లోలుగు–వీఆర్‌గూడెం రహదారిలోని తోటలో పేకాట ఆడుతు న్న తొమ్మిది మంది పేకాట రాయుళ్లను పట్టుకున్నామని ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు. వారి నుంచి రూ.1,02,360ల నగదు, ఆరు సెల్‌ఫోన్లు, ఆరు మోటారు సైకిళ్లను సీజ్ చేశా మని చెప్పారు. తొమ్మిది మందిలో ముగ్గురు లోలుగు గ్రామానికి చెందిన వారని, ఆరుగురు శ్రీకాకుళానికి చెందిన వారని తెలిపారు. కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
అర్హత కలిగిన రైతులందరికీ అన్నదాత సుఖీభవ
టెక్కలి: అర్హత కలిగిన రైతులందరికీ అన్నదాత సుఖీభవ అందజేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం కోటబొమ్మాళి మండలం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో వ్యవసాయాధికారులతో కలిసి రైతులకు ఉపయోగకరమైన సేవలపై కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో 2,74,208 మంది రైతులకు సుమారు రూ.186 కోట్ల మేరకు అన్నదాత సుఖీభవ పథకం కింద సాయం అందజేశామని పేర్కొన్నారు. రైతు లకు ఆదాయం పెంచే విధంగా అధికారులు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారులు త్రినాథస్వామి, జగన్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో భూమి పూజ
సంతబొమ్మాళి: మూలపేట పోర్టు నిర్వాసితులకు నౌపడ ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్ తదితర విభాగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 32 కోట్లతో పనులు చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదివారం సాయంత్రం భూమి పూజ చేశారు. నిర్వాసితులకు సౌకర్యాలతో కాలనీలో ఏర్పాటు చేస్తామన్నారు. నౌపడ 3 రోడ్లు జంక్షన్‌కు చెందిన పలువురు పోర్టు బాధితులు ఇళ్ల నిర్మాణానికి భూమిని కేటాయించాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, టెక్కలి ఆర్‌డీఓ కృష్ణమూర్తి, తహసీల్దార్ హేమ సుందర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.
రైతులు లేకుండానే రైతు సంబరం
శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని పలు పంచాయతీలకు చెందిన పారిశుద్ధ్య వాహనాలతో రైతు సంబరం సభ ర్యాలీను ఆదివారం సాయంత్రం నిర్వహించారు. స్థానిక శిమ్మపేట నుంచి వప్పంగి, అరసవల్లి మీదుగా ఈ ర్యాలీ నిర్వహించారు. కానీ రైతులు లేకుండానే పారిశుద్ధ్య కార్మికులు, వాహన డ్రైవర్లతోనే కార్యక్రమాన్ని మమ అనిపించేశారు.

పేకాట రాయుళ్లు అరెస్టు