అంతా ఆర్భాటమే! | - | Sakshi
Sakshi News home page

అంతా ఆర్భాటమే!

Sep 22 2026 1:30 AM | Updated on Sep 22 2026 1:30 AM

ధర్మవరం అర్బన్‌: బియ్యం, నిత్యావసర సరుకుల ధరలు అమాంతం పెరగడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజలకు సబ్సిడీపై సన్న బియ్యం అందిస్తామని ఆశ చూపిన చంద్రబాబు ప్రభుత్వం ప్రకటనలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా సబ్సిడీ సన్న బియ్యం విక్రయ కేంద్రాలను ఆర్భాటంగా ఎమ్మెల్యేలు, మంత్రులతో ప్రారంభించింది. ఈ కేంద్రాలు మూణ్నాళ్ల ముచ్చటగా మారిపోయాయి.

జిల్లాలోని రైతు బజార్‌లు, రైస్‌ మిల్లుల అవుట్‌లెట్‌ స్టోర్లలో సబ్సిడీ బియ్యం విక్రయ కేంద్రాలను ఆగస్టు 3న ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రారంభించారు. బియ్యం విక్రయ కేంద్రాల నిర్వహణ బాధ్యతను రైస్‌ మిల్లర్ల అసోసియేషన్‌కు అప్పగించారు. మిల్లర్ల అసోసియేషన్‌ ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకించినా పౌర సరఫరాల శాఖ అధికారులు రంగంలోకి దిగి బలవంతంగా ఒప్పించారు. ఆగస్టు 3న సబ్సిడీ విక్రయ కేంద్రాలలో ఏర్పాటు చేసిన బ్యానర్లలో స్టీమ్‌ బియ్యం (బీపీటీ) బహిరంగ మార్కెట్‌లో రూ.62 ఉండగా ప్రత్యేక కౌంటర్ల ధర రూ.52కు, రా బియ్యం (బీపీటీ) బహిరంగ మార్కెట్‌ ధర రూ.58 ఉండగా ప్రత్యేక కౌంటర్ల ధర రూ.50గా నమోదు చేసి ప్రచారం చేశారు. కాని కొన్నిరోజులు మాత్రమే సామాన్యులకు బియ్యం పంపిణీ చేసి కేంద్రాలను మూసివేశారు.

ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవకపోవడం, వరి పంట పండించేందుకు ప్రభుత్వం సాగునీరు వదలకపోవడంతో బియ్యం ధరలు అమాంతం పెరిగిపోయాయి. మూడు నెలల కాలంలో ఏకంగా నాలుగు సార్లు బియ్యం ధరలు ఎగబాకాయి. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు సన్న బియ్యం కొనలేని పరిస్థితి ఏర్పడింది. మూడు నెలల క్రితం రూ.45 నుంచి రూ.50కు మార్కెట్‌లో లభించిన కిలో బీపీటీ బియ్యం(క్వాలిటీని బట్టి) ప్రస్తుతం రూ.65 నుంచి రూ.72 వరకు పెరిగాయి. జిల్లాలోని పలు సబ్సిడీ కేంద్రాల్లో నాణ్యతలేని బియ్యం అందిస్తుండటంతో ప్రజలు కొనడం మానేశారు.

మూతపడిన సన్న బియ్యం

విక్రయ కేంద్రాలు

పట్టించుకోని పాలకులు

బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరలు పెరిగి సామాన్యులకు చుక్కలు

మూడు నెలలుగా బహిరంగ

మార్కెట్‌లో బియ్యం ధరలు

విపరీతంగా పెరిగిపోయాయి.

ధరలను అదుపుచేయలేని చంద్రబాబు ప్రభుత్వం సన్న బియ్యాన్ని

సామాన్యులకు తక్కువ ధరకే

అందుబాటులోకి తెచ్చేందుకంటూ జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసింది. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఆగస్టు 3న జిల్లాలోని రైతు బజార్లు, రైస్‌ మిల్లుల అవుట్‌లెట్‌ స్టోర్లలో ఆర్భాటంగా ప్రారంభించిన కేంద్రాలు అప్పుడే మూతపడ్డాయి.

నాలుగుసార్లు పెరిగాయ్‌!

బలవంతంగా ఒప్పించి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement