పింఛన్‌ ఇంటివద్దకే వెళ్లి ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

పింఛన్‌ ఇంటివద్దకే వెళ్లి ఇవ్వాలి

Aug 15 2026 7:29 AM | Updated on Aug 15 2026 7:29 AM

పుట్టపర్తి అర్బన్‌: అర్హులందరికీ ఇంటి వద్దకే వెళ్లి పింఛన్‌ మొత్తం అందించాలని సెర్ప్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ లక్ష్మీప్రసాద్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం పుట్టపర్తిలోని డీఆర్‌డీఏ కార్యాలయంలో ఎంపీడీఓలు, మున్సిపల్‌ కమిషనర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరగకుండా పర్యవేక్షించాలన్నారు. కొన్ని సచివాలయాల పరిధిలో నెట్‌ వర్క్‌ సమస్య ఎదురవుతోందని, దీన్ని అధిగమించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. పంపిణీ తర్వాత మిగిలిన మొత్తాన్ని సెర్ప్‌కు తిరిగి పంపాలన్నారు. డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, జీఎస్‌డబ్ల్యూఎస్‌ నోడల్‌ ఆఫీసర్‌ శ్రీలక్ష్మి పాల్గొన్నారు.

‘శ్రావణ’ వేడుకలు ప్రారంభం

పావగడ: స్వర్ణ శనీశ్వరాలయంలో శ్రావణ మాస ఉత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి, శీతలాంభదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ శుద్ధ తదియ 15న తొలి శ్రావణ శనివారం వేడుకలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఉత్సవాలకు భారీగా భక్తులు..

శ్రావణమాసంలో వచ్చే శనివారం శనీశ్వరస్వామిని కొలిస్తే పాపాలు తొలగి పుణ్యం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. అందుకే పావగడ శనీశ్వరుడి దర్శనానికి ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ నుంచి భక్తులు భారీగా తరలివచ్చి శని దోష నివారణకు పూజలు చేస్తుంటారు. స్వామివారికి ఇష్టమైన నల్ల నువ్వుల తైలం, నల్ల వస్త్రాలు, నవ ధాన్యాలు సమర్పిస్తారు.

‘చేయూత’ను

సద్వినియోగం చేసుకోండి

జాయింట్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌

ప్రశాంతి నిలయం: విభిన్న ప్రతిభావంతుల కోసం రోటరీ క్లబ్‌, రెడ్‌ క్రాస్‌ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 30న అనంతపురంలో కృత్రిమ చేతులను ఉచితంగా పంపిణీ చేసేందుకు చేయూత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని జాయింట్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ తెలిపారు. గురువారం ఆయన కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో చేయూత కార్యక్రమ పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం జేసీ మాట్లాడుతూ.. ఉపకరణాలు కావాల్సిన వారు మందుస్తుగా 8866306969 నంబర్‌కు ఫోన్‌ చేయాలన్నారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా చైర్మన్‌ సురేష్‌, కార్యదర్శి విశ్వనాథ్‌ పాల్గొన్నారు.

వినియోగదారుల సదస్సుకు ఆహ్వానం

సెప్టెంబర్‌ 12,13 తేదీల్లో పుట్టపర్తిలో నిర్వహించనున్న జాతీయ వినియోగదారుల సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని జేసీ మౌర్య భరద్వాజ్‌కు వినియోగదారుల సంఘం నాయకులు ఆహ్వానించారు. క్యాప్‌కో చైర్మన్‌ సురేష్‌, అన్నదాత రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement