పోరాట స్ఫూర్తి.. స్వాతంత్య్ర దీప్తి | - | Sakshi
Sakshi News home page

పోరాట స్ఫూర్తి.. స్వాతంత్య్ర దీప్తి

Aug 15 2026 2:15 AM | Updated on Aug 15 2026 2:15 AM

క్లుప్తంగా

ట్రాక్టర్‌ బోల్తా – ఇద్దరికి గాయాలు

పుట్టపర్తి అర్బన్‌: ఓ రైతు పొలానికి విద్యుత్‌ స్తంభాలు తరలిస్తుండగా ప్రమాదవశాత్తూ ట్రాక్టర్‌ బోల్తా పడటంతో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన పుట్టపర్తి మండలం బత్తలపల్లి వద్ద చోటు చేసుకుంది. మండల పరిధిలోని కొట్లపల్లికి చెందిన రైతు సూరి వ్యవసాయ అవసరాల కోసం విద్యుత్‌ స్తంభాలను పుట్టపర్తి నుంచి తీసుకొచ్చే క్రమంలో ట్రాక్టర్‌ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో డ్రైవింగ్‌ చేస్తున్న గాజులపల్లి తండాకు చెందిన రంజిత్‌నాయక్‌కు ఎడమ కాలు విరిగింది. గంగాధర్‌ అనే వ్యక్తి గాయపడ్డాడు. తీవ్రంగా గాయపడిన రంజిత్‌ను అనంతపురం తరలించారు.

అనంతపురం కల్చరల్‌: దేశమాత స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడానికి అనంత వాసుల పోరాట స్ఫూర్తి, వారి అద్వితీయ త్యాగం ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. కల్లూరు సుబ్బారావు, తరిమెల నాగిరెడ్డి, పప్పూరు రామాచార్యులు, యర్రమల కొండప్ప, రజియాబీ, ఓబయ్య వంటి వారి విగ్రహాలను స్మృతి చిహ్నాలుగా మార్చుకుని అనంత వాసులు నిత్యం తలచుకుంటూనే ఉన్నారు.

సర్వస్వం దేశం కోసమే..

రాయలసీమ పితామహుడిగా పేరొందిన కల్లూరు సుబ్బారావుకు స్వాతంత్య్ర సమరయోధుడిగా గుర్తించి ప్రభుత్వం ఇచ్చిన విలువైన స్థలాన్ని లలితకళలను ప్రోత్సహించేందుకు ఉదారంగా దానమిచ్చారు. ఆయన చలువతోనే కాంగ్రెస్‌ కార్యాలయం, లలితకళాపరిషత్తు నడుస్తున్నాయి. అలాగే 1934లో మహాత్మాగాంధీ అనంతకు విచ్చేసిన సందర్భంలో మహాత్ముడు హరిజనోద్ధరణకు వెంట నడవాలనిచ్చిన పిలుపునకు అనంత వాసి యర్రమల కొండప్ప స్పందించారు. భూదాన ఉద్యమ నేత వినోభా బావే స్ఫూర్తితో ఎంతో విలువైన రెండు ఎకరాల భూమిని ధారాదత్తం చేశారు. ఆయనిచ్చిన స్థలంలోనే జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్‌ ప్రాంతంలో ప్రస్తుతం అంబేడ్కర్‌ భవనం నడుస్తోంది. కేఎం రహంతుల్లా కుటుంబీకులు పాతూరు పవర్‌ ఆఫీసుకు, సీడీ ఆస్పత్రికి, ఆర్ట్స్‌ కళాశాలకు విలువైన భూములను దానం ఇచ్చారు.

ఆనాటి త్యాగానికి

నిలువెత్తు రూపం ‘టవర్‌క్లాక్‌ ’

జిల్లా కేంద్రంలో నిర్మించిన టవర్‌క్లాక్‌ నాటి చరిత్రను ఘనంగా చాటిచెబుతోంది. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన 1947వ సంవత్సరానికి గుర్తుగా 47 అడుగుల ఎత్తు, ఆగస్టుకు గుర్తుగా 8 భుజాలను, 15వ తేదీకి గుర్తుగా పదిహేను అడుగుల వెడల్పుతో ఉండేట్టు నిర్మించిన అపురూప కట్టడాన్ని అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రారంభించారు.

సచివాలయ

ఉద్యోగి సస్పెన్షన్‌

తాడిమర్రి: మండలంలోని దాడితోట సచివాలయంలో పశుసంవర్ధకశాఖ సహాయకుడిగా పని చేస్తున్న ఎన్‌.బ్రహ్మయ్యను శుక్రవారం ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. పశువైద్య కేంద్రం వైద్యాధికారి యూనస్‌ మహ్మద్‌, సచివాలయాల ఎంపీడీఓ మేశ్యాబాబు వివరాలమేరకు.. పాడి రైతులకు ప్రభుత్వం అందించే గోకులం షెడ్లు మంజూరు చేయిస్తానని రైతులను నమ్మించి 16 మంది రైతుల నుంచి ఒక్కొక్కరి నుంచి రూ.20 వేలు నుంచి రూ.30 వేల దాకా వసూలు చేశాడు. నెలలు గడుస్తున్నా గోకులం షెడ్లపై ఎలాంటి సమాచారం లేకపోవడంతో పలువురు రైతులు పశువైద్యాధికారి దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయం ఉన్నతాధికారులకు వరకూ వెళ్లడంతో గ్రామంలో అధికారులు విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలోనే సచివాలయ ఉద్యోగిపై పలువురు రైతులు గురువారం తాడిమర్రి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో సదరు ఉద్యోగిని సస్పెండ్‌ చేసినట్లు పశుసంవర్ధకశాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు పంపినట్లు వైద్యాధికారి తెలిపారు.

సిమెంట్‌ లారీని ఢీకొన్న కారు

వృద్ధుడి మృతి

పెనుకొండ రూరల్‌: రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందిన సంఘటన 44వ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. కియా ఎస్‌ఐ డి.రాఘవయ్య వివరాల మేరకు.. తమిళనాడు రాష్ట్రం హోసురు జిల్లా చిన్నకొల్లుకు చెందిన ప్రేమ్‌సింగ్‌ సుబేదార్‌ (71) తన కుటుంబ సభ్యులతో కలసి అద్దె కారులో కోర్టు పని నిమిత్తం హైదరాబాద్‌ వెళ్లాడు. తిరిగి చిన్నకొల్లు వెళ్తుండగా శుక్రవారం తెల్లవారుజామున గుట్టూరు కనుమ సమీపంలోకి రాగానే డ్రైవర్‌ కమల్‌ లోచన దాస్‌ ముందు వెళ్తున్న సిమెంట్‌ లారీని ఢీ కొన్నాడు. ఈ ఘటనలో ముందు భాగంలో డ్రైవర్‌ పక్కన కూర్చున్న ప్రేమ్‌ సింగ్‌ సుబేదార్‌ అక్కడిక్కడే మృతి చెందారు. డ్రైవర్‌తో పాటు ప్రేమ్‌సింగ్‌ సుబేదార్‌ భార్య రేఖాబాయి, కుమార్తె సంతోషి స్వల్పగాయాలతో బయటపడ్డారు. కియా పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, శవాన్ని పోస్టు మార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతునికి కుమారుడు విగ్నేశ్వర్‌ ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

శోభాయమానంగా శనీశ్వరాలయం

పావగడ: శ్రావణ శని వారోత్సవాలను పురస్కరించుకుని శనీశ్వరాలయాన్ని అందంగా తీర్చి దిద్దారు. విద్యుత్‌ దీపాల అలంకరణతో ఆలయం వెలిగిపోతోంది. ఇప్పటికే దావణగెరె, చళ్లకెరె, చిత్రదుర్గం, శివమొగ్గ ప్రాంతాల నుంచి భక్తులు వందలాదిగా పావగడకు తరలి వస్తున్నారు. ఎస్‌ఎస్‌కే అతిథి గృహం గదులు భక్తులతో నిండిపోయాయి. ఆలయ డార్మెటరి భవనం, ఎస్‌ఎస్‌కే రంగ మందిరంలో భక్తులు బస చేసే అవకాశముంది. అనేక మంది భక్తులు శుక్రవారం రాత్రికే శనీశ్వరుడి దర్శనానికి క్యూ కట్టే కట్టనున్నారు. శ్రావణ శుద్ధ తదియ శనివారం ఉదయం 4 గంటల నుంచి పంచామృతాభిషేకం, క్షీరాభిషేకం, నవగ్రహ పూజా కై ంకర్యాలు నిర్వహించనున్నారు.

జాతీయస్థాయి హాకీ పోటీలకు ఎంపిక

ధర్మవరం అర్బన్‌: జాతీయస్థాయి హాకీ పోటీలకు జిల్లా క్రీడాకారులు ఎంపికయ్యారని హాకీ ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యక్షుడు సూర్యప్రకాష్‌ తెలిపారు. ఈనెల 12 నుంచి 22వ తేదీ వరకు మహారాష్ట్రలోని పూణేలో జరుగుతున్న జాతీయస్థాయి జూనియర్‌ మహిళల హాకీ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే రాష్ట్ర జట్టుకు జిల్లాకు చెందిన పతకమూరి ప్రవిత, రమావత్‌ వర్ష, పూజారి మధురిమబాయి ఎంపికయ్యారన్నారు. బాలుర విభాగంలో ధర్మవరానికి చెందిన రమావత్‌ లవన్‌కుమార్‌నాయక్‌ గతనెలలో కొయంబత్తూరులో జరిగిన జాతీయ జూనియర్‌ పురుషుల హాకీ పోటీల్లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించాడని తెలిపారు. ఎంపికై న క్రీడాకారులను హాకీ ఆంధ్రప్రదేశ్‌ జిల్లా అధ్యక్షుడు బీవి శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు గౌరీప్రసాద్‌, రామచంద్ర, మహమ్మద్‌ అస్లాం, ఊకా రాఘవేంద్ర, ట్రెజరర్‌ అంజన్న, జాయింట్‌ కార్యదర్శి అరవింద్‌ గౌడ్‌, చందు, మారుతికుమార్‌, డైరెక్టర్లు అమునొద్దిన్‌, కిరణ్‌, ఇర్షాద్‌, సత్యసాయి జిల్లా హాకీ కోచ్‌ హస్సేన్‌ తదితరులు అభినందించారు.

స్వాతంత్య్ర దినోత్సవం వేళ ఉట్టిపడుతున్న దేశభక్తి

నాటి జ్ఞాపకాలను నెమరవేసుకుంటున్న స్వాతంత్య్ర సమరయోధులు

నేటికీ పదిలంగా త్యాగాల స్మృతి చిహ్నాలు

వాడవాడలా జెండా పండుగకు ప్రత్యేక ఏర్పాట్లు

బానిసత్వపు నరకాన్ని ప్రత్యక్షంగా అనుభవించిన భారతీయులు బ్రిటీషర్ల నుంచి విముక్తి పొందేందుకు, దేశానికి స్వాతంత్య్రం సాధించేందుకు ప్రాణాలను సైతం లెక్క చేయలేదు. తెల్లవారి తుపాకీ గుండ్లకు ఎదురురొడ్డి నిలిచి దేశానికి స్వాతంత్య్రాన్ని తెచ్చిపెట్టారు.

వారి సాహసాలు, స్వాతంత్య్ర దీక్షలు అందరిలో చెరగని ముద్ర వేశాయి. ఈ తీపి గుర్తులు వారసత్వ సంపదగా తరతరాలుగా కొనసాగుతూనే ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement