మా నాన్నను చంపి మాపైనే కేసు పెట్టారు | - | Sakshi
Sakshi News home page

మా నాన్నను చంపి మాపైనే కేసు పెట్టారు

Jul 26 2026 8:06 AM | Updated on Jul 26 2026 8:06 AM

పుట్టపర్తి టౌన్‌: ‘‘అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని కోరిన మా నాన్నను టీడీపీ నాయకులు కొట్టి చంపితే...పోలీసులు మాపై అక్రమ కేసు బనాయించి వేధిస్తున్నారు. టీడీపీ నాయకుల ఒత్తిళ్లకు స్థానిక పోలీసులు తలొగ్గారు. మీరైనా మాకు న్యాయం చేయండి’’ అని ఇటీవల హత్యకు గురైన కనగానపల్లికి చెందిన అంకె నగేష్‌ కుటంబీకులు అఖిల, కావ్య, పురుషోత్తం, లక్ష్మణ్‌, గోపాల్‌, అశోక్‌ తదితరులు ఎస్పీ సతీష్‌కుమార్‌ను కోరారు. శనివారం వారు పుట్టపర్తిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీని కలిసి తనకు న్యాయం చేయాలని వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఎస్పీ.. విచారించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు వారు వెల్లడించారు.

నిందితుల్లో ఇద్దరిని వదిలేశారు..

ఈ ఏడాది జూలై 21వ తేదీన అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని కోరిన పాపానికే తమ తండ్రిని టీడీపీ కార్యకర్తలు కొట్టి చంపారని అంకె నగేష్‌ పిల్లలు ఆరోపించారు. జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో వారు విలేకరులతో మాట్లాడారు. తమ తండ్రి హత్య కేసుకు సంబంధించి తాము 11 మంది టీడీపీ కార్యకర్తలపై ఫిర్యాదు చేశామన్నారు. 11 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అఽధికార టీడీపీ నాయకుల ఒత్తిళ్ల తలొగ్గి 9 మందిని మాత్రమే అరెస్ట్‌ చేసి ఇద్దరిని వదిలేశారు. అంతేకాకుండా తమ కుటుంబ సభ్యులు, సోదరులు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సానుభూతి పరులపై కూడా అక్రమ కేసుసు బనాయించారు. బాధిత కుటుంబమైన తమకు అండగా ఉండి న్యాయం చేయకుండా... అక్రమ కేసు పెట్టారని వాపోయారు. అందుకే న్యాయం చేయాలని ఎస్పీ సతీష్‌కుమార్‌ను కోరినట్లు వారు వెల్లడించారు.

టీడీపీ నేతల ఒత్తిళ్లకు

పోలీసులు తలొగ్గారు

న్యాయం చేయాలని ఎస్పీని కోరిన

అంకె నగేష్‌ కుటుంబీకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement