నిత్యావసరాలు సకాలంలో తరలించాలి | - | Sakshi
Sakshi News home page

నిత్యావసరాలు సకాలంలో తరలించాలి

Jul 18 2026 9:39 AM | Updated on Jul 18 2026 9:39 AM

ప్రశాంతినిలయం: జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ లబ్ధిదారులకు అందించే బియ్యం, చక్కెర, పప్పులు తదితర నిత్యావసర సరుకులను ఎఫ్‌పీ షాపులకు సకాలంలో తరలించాలని జేసీ మౌర్య భరద్వాజ్‌ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌ లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో సంబంధిత అధికారులు, కంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జేసీ మాట్లాడుతూ గోడౌన్‌ ఇన్‌చార్జ్‌లు, స్టేజ్‌–2 కాంట్రాక్టర్ల సమన్వయంతో నిర్దేశించిన షెడ్యూల్‌ ప్రకారం సరుకులు తరలించాలన్నారు. ఎలాంటి జాప్యం లేకుండా, అవకతవకలకు తావు లేకుండా బాధ్యాతాయుతంగా వ్యవహరించాలన్నారు. సరుకుల పంపిణీని గోడౌన్‌ ఇన్‌చార్జ్‌లు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. సమస్యాత్మకంగా ఉన్న కొన్ని గోడౌన్లలో హమాలీ మేసీ్త్రలతో మాట్లాడి సరుకుల లోడింగ్‌, అన్‌లోడింగ్‌ ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

‘భారత్‌ టెక్స్‌’లో

మెరిసిన ధర్మవరం పట్టు చీరలు

ధర్మవరం: న్యూఢిల్లీలో ఈనెల 13 నుంచి 17 వరకు భారత్‌ మంటపంలో జరిగిన అంతర్జాతీయ వస్త్ర వినియోగదారుల సమ్మేళనంలో ధర్మవరం పట్టుచీరల ప్రత్యేకత చాటుకున్నట్లు జాతీయ అవార్డు గ్రహీత జుజారే నాగరాజు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ తరఫున ఈ సమ్మేళనంలో పట్టుచీరలను నాగరాజు ప్రదర్శించారు. దేశ విదేశాల నుంచి వచ్చిన సందర్శకులకు ధర్మవరం పట్టుచీరలు, పట్టు పావడాల విశిష్టతలను డిజైనర్‌ విశదీకరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారికి చేనేత మగ్గాల ద్వారా తయారు చేసి అందిస్తున్న వస్త్రాల ప్రత్యేకతలను వివరించారు. ఈసమ్మేళనంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చేనేత శాఖమంత్రి సవిత ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు. అనంతరం ముఖ్యఅతిథులకు డిజైనర్‌ నాగరాజు వెంకటేశ్వరస్వామి ప్రతిమలను అందించారు.

చెక్‌ బౌన్స్‌ కేసులపై నేడు ప్రత్యేక లోక్‌ అదాలత్‌

అనంతపురం: చెక్‌ బౌన్స్‌కు సంబంధించి నమోదైన కేసులపై ఈ నెల 18 ప్రత్యేక లోక్‌అదాలత్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌ భీమారావు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. శనివారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు చెక్‌ బౌన్స్‌ కేసులపై ఉమ్మడి జిల్లాలలోని ప్రతి కోర్టు ఆవరణలోనూ ప్రత్యేక లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement