హిందూపురం: సుస్థిర పాలనకు స్ఫూర్తి ఛత్రపతి శివాజీ మహరాజ్ అని పలువురు కొనియాడారు. శుక్రవారం హిందూపురంలోని ప్రధాన రహదారిలో శివాజీ సేవాట్రస్టు అధ్యక్షుడు చలపతి, వానరసేన ఆధ్వర్యంలో అట్టహాసం వైభవంగా మరాఠా యోధుడు చత్రపతి శివాజీ మహరాజ్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ముందుగా శివాజీ విగ్రహం వద్ద వేదపడింతులతో హోమాలు, పూజలు నిర్వహిచారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో భారతీయ సంస్కృతి, సాంప్రదాయ ప్రచారకర్త కమలనంద భారతీస్వామిజీ, శివసాయిబాబా, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు విష్ణువర్థన్‌రెడ్డి మాట్లాడారు. అన్నివర్గాలకు సుస్థితర పాలన అందించిన ఏకై క హిందూ సామ్రాజ్యాధినేత ఛత్రపతి శివాజీ అని కొనియాడారు. శివాజీ విగ్రహం ఒక శిల్పం కాదని దేశభక్తి, ధైర్యం, క్రమశిక్షణ, మంచి పాలన, ప్రజాసేవకు స్ఫూర్తి అని కొనియాడారు. అనంతరం చిన్నారుల భరతనాట్య ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, పలువురు రాజకీయ పార్టీల నాయకులు హాజరయ్యారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించారు. ఈసందర్భంగా ఏఎస్‌పీ మహేష్ నేతృత్వంలో సీఐలు రాజగోపాల్ నాయుడు, జనార్దన్, అబ్దుల్‌కరీం ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.


