క్రిస్మస్ శోభ
ప్రశాంతి నిలయం: ప్రశాంతి నిలయం క్రిస్మస్ శోభను సంతరించుకుంది. దేశ విదేశాలకు చెందిన వేలాదిమంది భక్తులు వేడుకల్లో పాల్గొనేందుకు ప్రశాంతి నిలయం చేరుకున్నారు. ప్రశాంతి నిలయంలో ఎక్కడ చూసినా క్రిస్మస్ ట్రీలు, విద్యుత్ దీపాలు, శాంతాక్లాజ్ రూపాలే కనిపిస్తున్నాయి. సత్యసాయి మహాసమాధిని, సాయికుల్వంత్ సభా మందిరాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. గణేష్ గేట్ వద్ద ఏర్పాటు చేసిన 50 అడుగుల క్రిస్మస్ ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. బుధవారం సాయంత్రం సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహా సమాధి చెంత సత్యసాయి విదేశీ భక్తులు పలు భక్తిగీతాలను ఆలపించారు. గురువారం సాయికుల్వంత్ సభా మందిరంలో క్రిస్మస్ వేడుకలు జరగనున్నాయి. అలాగే జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలకు చర్చీలు ముస్తాబయ్యాయి.
క్రిస్మస్ శోభ
క్రిస్మస్ శోభ
క్రిస్మస్ శోభ


