ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు
● కలెక్టర్ శ్యాంప్రసాద్
ప్రశాంతి నిలయం: జిల్లా ప్రజలకు కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రీస్తు బోధించిన మార్గంలో నడవడం ద్వారా లోక కల్యాణం సాధ్యమవుతుందన్నారు. ప్రేమ, కరుణ, శాంతిలకు చిహ్నంగా క్రిస్మస్ పర్వదినాన్ని జరుపుకుంటారన్నారు. ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకోవాలన్నారు.
వైభవంగా
అంకురార్పణ పూజలు
పావగడ: నాగలమడక అంత్య సుబ్రహ్మణ్యస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయ గర్భగుడిలో కొలువు తీరిన స్వయంభూ అంత్య సుబ్రహ్మణ్యస్వామి మూలవిరాట్ వద్ద బుధవారం అంకురార్పణ పూజలు ఘనంగా జరిగాయి. ఆలయ ప్రధాన అర్చకుడు బదరీనాథ్ వేద మంత్రాల పఠనంతో స్వామి వారికి పూజలు నిర్వహించారు. పూజల్లో ఆలయ నిర్మాణానికి నాంది పలికిన రొద్దం శేషయ్యశెట్టి వారసులు సురేంద్రబాబు, నాగరాజు, భాస్కర్, భాస్కర్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
సాదాబైనామా భూముల క్రమబద్ధీకరణకు మరో అవకాశం
ప్రశాంతి నిలయం: గ్రామీణ ప్రాంతాల్లోని సాదా బైనామా భూముల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించిందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. సాదాబైనామా భూముల క్రమబద్ధీకరణకు దరఖాస్తుల స్వీకరణ గడువును 2027 డిసెంబర్ 31 వరకు పొడిగించడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములకు మాత్రమే వర్తిస్తుందని, భూమిపై స్వాధీనానుభవం కలిగిన చిన్న , సన్నకారు రైతులు మాత్రమే అర్హులన్నారు. స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్‌ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు పూర్తిగా మినహాయింపు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. 2024 జూన్ 15 వరకూ జరిగిన సాదాబైనామా లావాదేవీలకు మాత్రమే ఈ విధానం వర్తిస్తుందన్నారు. అర్హులైన రైతులు ప్రభుత్వం విధించిప గడువులోపు మీ సేవా కేంద్రాలు, సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
స్నాతకోత్సవానికి
రాష్ట్రపతికి ఆహ్వానం
అనంతపురం: సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీ (సీయూఏపీ) తొలి స్నాతకోత్సవం 2026 సంవత్సరంలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును స్నాతకోత్సవానికి ఆహ్వానించినట్లు వీసీ ఎస్‌ఏ కోరి తెలిపారు. రాష్ట్రపతి చేతుల మీదుగా విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు.
పత్తి రైతులకు తప్పని తిప్పలు
గుత్తి: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో భారత పత్తి సంస్థ (సీసీఐ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రం వద్ద రైతులకు తిప్పలు తప్పడం లేదు. వారంలో కేవలం బుధవారం ఒక్క రోజే పత్తి కొనుగోలు చేపడుతుండడంతో రైతులు తెల్లవారు జామున నాలుగు గంటలకే పత్తి వాహనాలతో బారులు తీరుతున్నారు. ఈ క్రమంలో చలి తీవ్రత తాళలేక గజగజ వణికి పోతున్నారు. వారంలో కనీసం రెండు రోజులైనా పత్తిని కొనుగోలు చేస్తే ఎంతో వెసులుబాటుగా ఉంటుందని ఈ సందర్భంగా పలువురు రైతులు పేర్కొన్నారు.
ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు
ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు
ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు


