చెరువులో విష ప్రయోగం
ముదిగుబ్బ: మండలంలోని సానేవారిపల్లి చెరువులో బుధవారం ఉదయం పెద్ద సంఖ్యలో చేపలు మృతి చెందాయి. అటుగా వెళ్లిన వారు గుర్తించి సమాచారం ఇవ్వడంతో మత్స్యకారులు అక్కడకకు చేరుకుని పరిశీలించారు. చేపల మృతితో చెరువు ప్రాంతమంతా దుర్వాసన వెదజల్లుతోంది. ఎవరో కావాలనే చెరువులో విషం కలిపినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి.
చైన్‌స్నాచర్ల అరెస్ట్
హిందూపురం అర్బన్: ఒంటరి మహిళలే లక్ష్యంగా చేసుకుని వారి మెడలోని బంగారు గొలుసులను అపహరించుకెళుతున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. హిందూపురం రెండో పట్టణ పీఎస్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను డీఎస్పీ మహేష్ వెల్లడించారు. హిందూపురం, పరిసర ప్రాంతాల్లో చైన్‌స్నాచింగ్ ముఠా తిరుగుతున్నట్లు అందిన సమాచారంతో అప్రమత్తమైన టూటౌన్, అప్‌గ్రేడ్ సీఐలు అబ్దుల్ కరీం, ఆంజనేయులు, సిబ్బంది బృందాలుగా విడిపోయి వివిధ ప్రాంతాల్లో బుధవారం తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆటో నగర్ క్రాస్ వద్ద అనుమానాస్పద స్థితిలో తచ్చాడుతున్న ముగ్గురు యువకులను ఆరా తీయడంతో పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. దీంతో వారిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో పోలీసులు విచారణ చేయడంతో చైన్‌స్నాచింగ్ ఘటనలు వెలుగు చూశాయి. పట్టుబడిన వారిలో హిందూపురంలోని త్యాగరాజనగర్‌కు చెందిన హఫీజ్, (ఆఫీసుల్లా), సీపీఐ కాలనీ ఎర్రకొట్టాలకు చెందిన దాదా ఖలందర్, లేపాక్షి మండలం కొండూరు గ్రామానికి చెందిన పి.లక్ష్మిదేవి (ప్రస్తుతం విద్యానగర్ నివాసి) ఉన్నారు. వీరి నుంచి 85 గ్రాముల బరువున్న బంగారు గొలుసులు, స్కూటీ వాహనం స్వాదీనం చేసుకున్నారు. కాగా, హిందూపురం పరిధిలో 2024, 2025లో చోటు చేసుకున్న రెండు చైన్‌స్నాచింగ్ కేసుల్లో వీరి ప్రమేయం ఉన్నట్లు నిర్ధారణ అయింది. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.
సత్యసాయి సేవలకు న్యూయార్క్ కౌన్సిల్ విశిష్ట గుర్తింపు
ప్రశాంతి నిలయం: సత్యసాయి సేవలకు అమెరికాలోని నూయార్క్ కౌన్సిల్ విశిష్ట గుర్తింపునిచ్చింది. ఈ నెల 24న సత్యసాయి శతజయంతి వేడుకల నిర్వహణ దినంగా ప్రకటించింది. ఈ మేరకు ఈ నెల 22న న్యూయార్క్ నగర కౌన్సిల్ హాల్‌లో జరిగిన ప్రత్యేక సమావేశంలో నూయార్క్ సిటీ మేయర్ ఎరిక్ ఆడమ్స్ అధికారికంగా ఈ ప్రకటన చేశారు. ఈ సందర్బంగా ఆయన సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ప్రత్యేకంగా రాసిన సందేశాన్ని చదివి వినిపించారు.
చెరువులో విష ప్రయోగం
చెరువులో విష ప్రయోగం


