ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

Nov 21 2026 11:59 PM | Updated on Nov 21 2026 11:59 PM

చిల్లకూరు: గూడూరు పట్టణంలోని తూర్పువీధి ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఒకటో పట్టణ సీఐ శ్రీనివాసులు తెలిపారు. ఆయన వివరాల మేరకు.. ఇంటూరు మహీధర్‌(27) స్థానికంగా కూరగాయల మార్కెట్లో గుమస్తాగా పనిచేస్తున్నారు. అతను ఇటీవల అయ్యప్పమాల ధరించి నిష్టగా ఉన్నారు. అయితే ఏమి జరిగిందో తెలియదు కానీ శుక్రవారం రాత్రి ఇంట్లోని బెడ్‌ రూమ్‌లోకి వెళ్లి గడియ పెట్టుకున్నారు. పలువురు అతనికి ఫోన్‌ చేసినప్పటికీ స్పందించకపోవడంతో ఇంటికెళ్లగా అతను లోపల గడియపెట్టుకుని ఉండడంతో అనుమానం వచ్చి తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా ఫ్యానుకు ఉరి వేసుకుని ఉన్నారు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించే సరికే అప్పటికే మృతిచెందారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు సీఐ తెలిపారు. మృతికి గల కారణాలు తేలాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement