● వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

● వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం

Nov 21 2026 11:59 PM | Updated on Nov 21 2026 11:59 PM

కారు– ఆటో ఢీ .. వ్యక్తి మృతి

మర్రిపాడు: మండలంలోని చాబోలు క్రాస్‌రోడ్డు వద్ద శనివారం కారు, ఆటో ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ మృతిచెందారు. వివరాలిలా ఉన్నాయి. వరికుంటపాడు మండలం విరువూరు ఎస్సీ కాలనీకి చెందిన ఆటోడ్రైవర్‌ గుబిలి ఇజ్రాయెల్‌ (44) బద్వేల్‌లో ఆటో సర్వీసింగ్‌ చేయించుకుని కుమారుడితో ఇంటికి వస్తుండగా విజయవాడ నుంచి ఒంటిమిట్ట వెళ్తున్న కారు చాబోలు క్రాస్‌రోడ్డు వద్ద ఢీకొంది. ఈ ఘటనలో ఇజ్రాయెల్‌ అక్కడికక్కడే మృతిచెందగా అతని కుమారుడు సంతోష్‌ గాయపడ్డారు. కారులోని నలుగురు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి.

లారీని ఢీకొన్న మినీలారీ

నెల్లూరు(క్రైమ్‌): ముందు వెళ్తున్న లారీని వేగంగా మినీలారీ ఢీకొన్న ఘటనలో డ్రైవర్‌ మృతిచెందారు. సౌత్‌ ట్రాఫిక్‌ పోలీసుల వివరాల మేరకు.. తమిళనాడు రాష్ట్రం తంజావూరు జిల్లా పాపనాసం ప్రాంతానికి చెందిన పాండియన్‌ రాజేంద్రన్‌(43) మినీలారీ డ్రైవర్‌. అదేప్రాంతానికి చెందిన వెంకటేశ్వరన్‌ సుబ్రహ్మణ్యం వరికోత మెషీన్‌ ఆపరేటర్‌గా ప్రస్తుతం తాడేపల్లిగూడెంలో పనిచేస్తున్నారు. 20వ తేదీ పాండియన్‌ తాడేపల్లిగూడెం నుంచి వెంకటేశ్వరన్‌ సుబ్రహ్మణ్యాన్ని లారీలో ఎక్కించుకుని తంజావూరు బయలుదేరారు. శనివారం తెల్లవారుజామున గొలగమూడి క్రాస్‌రోడ్డు సమీపంలోకి వచ్చేసరికి ముందున్న లారీ స్పీడ్‌బ్రేకర్ల వద్ద నెమ్మదించడంతో పాండియన్‌ సడన్‌బ్రేక్‌ వేసినప్పటికీ మినీలారీ అదుపుతప్పి వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పాండియన్‌ ఘటనా స్థలంలోనే మృతిచెందారు. ప్రమాద ఘటనపై వెంకటేశ్వరన్‌ బాధిత కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. సౌత్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ కృష్ణారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి జీజీహెచ్‌ మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement