గోవును ఢీకొని.. | - | Sakshi
Sakshi News home page

గోవును ఢీకొని..

Nov 21 2026 11:59 PM | Updated on Nov 21 2026 11:59 PM

విడవలూరు: చీకట్లో రోడ్డుపైకి ఒక్కసారిగా గోవు అడ్డురావడంతో ఆటో ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని పార్లపల్లి శివారులో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. విడవలూరు గ్రామానికి చెందిన పూండ్ల రమేష్‌రెడ్డి (60) తన తండ్రి గోపాల్‌రెడ్డికి నెల్లూరులో ఓ ప్రైవేటు హాస్పిటల్లో వైద్యం చేయించేందుకు శనివారం విడవలూరు నుంచి బాడుగ ఆటోలో వెళ్లారు. చికిత్స అనంతరం ఇంటికి వస్తుండగా పార్లపల్లి శివారులోని బీపీసీఎల్‌ కార్యాలయం సమీపంలోకి రాగానే చీకట్లో రోడ్డుపైకి ఆవు ఒక్కసారిగా అడ్డు వచ్చింది. దీంతో ఆటో అదుపుతప్పి ఆవును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రమేష్‌రెడ్డి ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఆటోలో ఉన్న గోపాల్‌రెడ్డికి తీవ్రగాయాలు కావడంతో 108లో ఆస్పత్రికి తరలించారు. ఎస్సై సాయికల్యాణ్‌ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement