నామినేషన్ల వెల్లువ | - | Sakshi
Sakshi News home page

నామినేషన్ల వెల్లువ

Nov 15 2026 11:44 PM | Updated on Nov 15 2026 11:44 PM

గూడూరు: గూడూరు పురపోరుకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియలో ఆదివారం కోలాహలం నెలకొంది. ఈ ఒక్క రోజే 85 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పటి వరకు వచ్చిన 88లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి 34.. టీడీపీ – 39.. బీజేపీ – 7, కాంగ్రెస్‌ – 2, ఇండిపెండెంట్లు – 5, జనసేన – 1గా ఉన్నాయి. చైర్‌పర్సన్‌ స్థానానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున కోవూరు కల్పన, తిరుమలశెట్టి కీర్తి నామినేషన్లను వేశారు. టీడీపీ తరఫున చౌటూరి శిరీష పేరు దాదాపు ఖరారైందని సమాచారం.

కావలిలో..

కావలి: కావలి మున్సిపాల్టీకి సంబంధించిన చైర్మన్‌ స్థానానికి మూడు.. కౌన్సిలర్‌ స్థానాలకు 72 నామినేషన్లు దాఖలయ్యాయి. చైర్మన్‌కు సంబంధించి షఫీఉల్లా (ఎంఐఎం), పసుపులేటి పెంచలయ్య (సీపీఎం), బొట్లగుంట శ్రీహరినాయుడు (ఇండిపెండెంట్‌) తమ నామినేషన్లను సమర్పించారు.

రెండో రోజూ అంతే..

అల్లూరు: అల్లూరు నగర పంచాయతీకి సంబంధించి ఆదివారం సైతం నామినేషన్లు దాఖలు కాలేదని కమిషనర్‌ ఫణికుమార్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement