కూటమిలో కుంపట్లు | - | Sakshi
Sakshi News home page

కూటమిలో కుంపట్లు

Nov 15 2026 11:44 PM | Updated on Nov 15 2026 11:44 PM

● కావలి చైర్మన్‌ సీటు బీజేపీకి కేటాయింపు

● ఇండిపెండెంట్‌గా టీడీపీ సీనియర్‌ నేత శ్రీహరినాయుడు నామినేషన్‌

కావలి: ఏడేళ్ల సుదీర్ఘ విరామానంతరం కావలి మున్సిపాల్టీకి జరగనున్న ఎన్నికలు కూటమిలో కొత్త తలనొప్పులను తెచ్చి పెడుతున్నాయి. చైర్మన్‌ సీటును బీజేపీకి కేటాయించడాన్ని కొందరు టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. సైకిల్‌ పార్టీ సీనియర్‌ నేత బొట్లగుంట శ్రీహరినాయుడు.. ఇండిపెండెంట్‌గా నామినేషన్‌ను దాఖలు చేయడం చర్చనీయాంశమైంది. ఈ పరిణామంతో కావలి రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

పథకం ప్రకారం పక్కనబెట్టారు..!

శ్రీహరినాయుడు మొదట్నుంచీ టీడీపీ నేత. గత ఎన్నికల్లో పార్టీ విజయానికి కష్టపడ్డారు. అయితే ఎమ్మెల్యేగా కృష్ణారెడ్డి విజయం సాధించాక పథకం ప్రకారం ఈయన్ను పక్కనబెట్టారనే టాక్‌ నడుస్తోంది. ఈ తరుణంలో శాసనసభ్యుడి తీరుపై ఆయన గతంలో దుమ్మెత్తి పోశారు. కావలిలో మంచి పట్టున్న శ్రీహరినాయుడు.. చైర్మన్‌ స్థానానికి నామినేషన్‌ వేయడం కూటమికి పెద్ద దెబ్బేననే భావన స్థానికంగా వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement