పీజీఆర్‌ఎస్‌కు 181 వినతులు | - | Sakshi
Sakshi News home page

పీజీఆర్‌ఎస్‌కు 181 వినతులు

Sep 22 2026 12:00 AM | Updated on Sep 22 2026 12:00 AM

నెల్లూరు(క్రైమ్‌): నెల్లూరులోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. జిల్లా వ్యాప్తంగా 181 మంది తమ సమస్యలను వినతుల రూపంలో ఎస్పీ అజిత వేజెండ్లకు అందజేశారు. వాటిని పరిశీలించిన ఎస్పీ సమస్యలను చట్టపరిధిలో పరిష్కరించాలని ఆయా ప్రాంత పోలీస్‌ అధికారులను ఆదేశించారు. ప్రధానంగా పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించారని, ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడ్డారని, కన్నబిడ్డలు పట్టించుకోవడం లేదని, కేసుల్లో నిందితులను అరెస్ట్‌ చేయాలని, అదనపుకట్నం కోసం వేధిస్తున్నారని తదితర సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో నగర ఏఎస్పీ దీక్ష, దర్గామిట్ట, మహిళా పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌లు బి.కల్యాణరాజు, టీవీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

వచ్చేనెల 23 నుంచి నాటకోత్సవాలు

నెల్లూరు(బృందావనం): సాహితి సాంస్కృతిక సంస్థ హైదరాబాద్‌కు చెందిన కిన్నెర ఆర్ట్స్‌ థియేటర్‌ ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్‌ నాటక అకాడమీ సౌజన్యంతో అక్టోబర్‌ 23 నుంచి 25వ తేదీ వరకు నెల్లూరులోని పురమందిరంలో నాటకోత్సవాలు నిర్వహించనున్నట్లు వై.శేషగిరీశం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మద్దాళి రఘురామ్‌ ఆధ్వర్యంలో జరిగే ఈ ఉత్సవాల్లో రోజూ సాయంత్రం 6 గంటలకు సాంఘిక నాటికలను ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని నాటికల సమాజాల వారు నాటకోత్సవాలకు సంబంధించిన వివరాలకు 94402 66476 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

రాష్ట్ర స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక

నెల్లూరు(టౌన్‌): నెల్లూరు దర్గామిట్టలోని జిల్లా పరిషత్‌ బాలికల హైస్కూల్లో సోమవారం ఇండియన్‌ ఎనర్జీ బాస్కెట్‌ 2047 (ప్రాస్‌పెక్ట్స్‌ అండ్‌ ఛాలెంజెస్‌) ఇతివృత్తంతో జిల్లా స్థాయి సైన్స్‌ సెమినార్‌ పోటీలను నిర్వహించారు. వీటికి 25 మండలాల నుంచి మండలానికి ఇద్దరు చొప్పున విద్యార్థులు విచ్చేశారు. కోట మండలం చిట్టేడు ఎన్‌సీఆర్‌ జెడ్పీ హైస్కూల్‌ విద్యార్థి బి.రక్షిత ప్రథమ స్థానం, వీఆర్‌ఎంసీ స్కూల్‌ నుంచి జె.నేత్ర ద్వితీయ స్థానంలో నిలిచారు. వీరిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపనున్నారు. ఈ సందర్భంగా డీఈఓ బాలాజీరావు, సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో కూడా రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకరావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ వెంకటేశ్వరనాయక్‌, ఎంఈఓ మురళి, సీనియర్‌ డైట్‌ లెక్చరర్‌ రాధారాణి, విజయచంద్ర, సంపూర్ణ, జిల్లా సైన్స్‌ అధికారి మూర్తి పాల్గొన్నారు.

డ్రైవర్‌ పోస్టులకు

దరఖాస్తుల స్వీకరణ

నెల్లూరు సిటీ: నగరంలోని డిపో–1 పరిధిలో ఆన్‌కాల్‌ డ్రైవర్లుగా రోజూవారీ వేతనంతో నియామకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లుగా డిపో మేనేజర్‌ గోవర్ధన్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాసింజర్‌ బస్సు, డిపార్ట్‌మెంట్‌ గూడ్స్‌ వెహికల్‌ డ్రైవర్‌ల నియామకం జరుగుతోందన్నారు. హెవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌, 18 నెలల అనుభవం కలిగి వయసు 45 సంవత్సరాల్లోపు ఉండాలన్నారు. ఆసక్తి గల వారు ఆధార్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ జెరాక్స్‌లు తీసుకునివాలని సూచించారు.

మొబైల్‌ ఫోరెన్సిక్‌ యూనిట్‌ ప్రారంభం

నెల్లూరు(క్రైమ్‌): నేర పరిశోధనలో శాసీ్త్రయ ఆధారాల సేకరణను మరింత వేగవంతం చేసేందుకు జిల్లా పోలీస్‌ శాఖకు మొబైల్‌ ఫోరెన్సిక్‌ యూనిట్‌ (వ్యాన్‌) అందుబాటులోకి వచ్చింది. సోమవారం నెల్లూరులోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఆ వ్యాన్‌ను ఎస్పీ అజిత వేజెండ్ల ప్రారంభించారు. నేర స్థలంలో ఆధారాలను గుర్తించడం, సేకరించడం, భద్రపరచడం, డాక్యుమెంటేషన్‌ వంటి అనేక సేవలను అందించేలా ఈ వాహనాన్ని రూపొందించారు. కార్యక్రమంలో ఏఆర్‌ డీఎస్పీ చంద్రమోహన్‌, ఫింగర్‌ ప్రింట్‌ అండ్‌ క్లూస్‌టీమ్‌ ఇన్‌స్పెక్టర్‌ పి.శరత్‌బాబు పాల్గొన్నారు.

నిమ్మ ధరలు

(కిలో)

పెద్దవి : రూ.210

సన్నవి : రూ.150

పండ్లు : రూ.80

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement