కార్యకర్తలే పార్టీకి బలమైన పునాది | - | Sakshi
Sakshi News home page

కార్యకర్తలే పార్టీకి బలమైన పునాది

Sep 22 2026 12:00 AM | Updated on Sep 22 2026 12:00 AM

మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి

బుచ్చిరెడ్డిపాళెం: కార్యకర్తలే వైఎస్సార్‌సీపీకి బలమైన పునాది అని, గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంలో వారి పాత్ర కీలకమని రాష్ట్ర పీఏసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. బుచ్చి రూరల్‌ మండల పరిధిలో పార్టీ కార్యకర్తలకు గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసన్న మాట్లాడుతూ పార్టీలో ప్రతి కార్యకర్తకు ప్రత్యేక గుర్తింపు, గౌరవం కల్పించాలనే ఉద్దేశంతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఐడీకార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టారని తెలిపారు. బుచ్చి రూరల్‌ పరిధిలో సుమారు 5 వేల మంది కార్యకర్తలకు కార్డులు అందజేస్తున్నట్లు చెప్పారు. ఐడీ కార్డును కేవలం గుర్తింపు పత్రంగా కాకుండా పార్టీ తమకు కల్పించిన గౌరవంగా భావించాలని సూచించారు. నాయకత్వం తీసుకునే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement