ఆర్టీసీలో సిబ్బందిని నియమించాలి | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీలో సిబ్బందిని నియమించాలి

Sep 22 2026 12:00 AM | Updated on Sep 22 2026 12:00 AM

నెల్లూరు సిటీ: ఏపీఎస్‌ ఆర్టీసీలో సిబ్బంది నియామకానికి చర్యలు చేపట్టాలని ఏపీ పీటీడీ నేషనల్‌ మజ్దూర్‌ యూనిటీ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు వై.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. నెల్లూరులోని జిల్లా విస్తృత స్థాయి సమావేశం ఏపీ ఎన్జీఓ హోంలో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రభుత్వం ద్వారా కాకుండా ఆర్టీసీ సిబ్బంది చేత నడిపించాలన్నారు. కొత్త బస్సులు కొనుగోలు చేసి ప్రయాణికుల అవసరాలు తీర్చాలన్నారు. సిబ్బందిపై ప్రయాణికుల దాడులను అరికట్టేలా మేనేజ్‌మెంట్‌ చర్యలు తీసుకోవాలన్నారు. అక్టోబర్‌లో జరిగే కో ఆపరేటివ్‌ సొసైటీ ఎన్నికలకు నాయకులు, సిబ్బందిని సమాయాత్తం చేయడం జరిగిందన్నారు. సీసీఎస్‌ ఎన్నికల్లో 16 డెలిగేట్స్‌ని గెలిపించుకుని జిల్లాలో ఎన్‌ఎంయూ ఉనికిని చాటాల్సిందిగా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజేష్‌ కుమార్‌, జిల్లా అధ్యక్షుడు గాదెరాజు రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి అనిల్‌, రాష్ట్ర కార్యదర్శి చెంచులయ్య, రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ దయాబాబు, రాష్ట్ర కార్యదర్శి రమణరాజు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement