కండలేరులో 17.33 టీఎంసీలు | - | Sakshi
Sakshi News home page

కండలేరులో 17.33 టీఎంసీలు

Sep 22 2026 12:00 AM | Updated on Sep 22 2026 12:00 AM

రాపూరు: కండలేరు జలాశయంలో సోమవారం నాటికి 17.33 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జలాశయం ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 115, లోలెవల్‌ కాలువకు 10, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్‌ కాలువకు 35 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.

గురజాడకు

ఘన నివాళి

నెల్లూరురూరల్‌: గురజాడ అప్పారావు జయంతిని కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో సోమవారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి జేసీ వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయకుమార్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. జేసీ మాట్లాడుతూ గురజాడ రచనలు సామాజిక దురాచారాలను ప్రశ్నిస్తూ ప్రజల్లో చైతన్యం కలిగించాయన్నారు. ‘కన్యాశుల్కం’ నాటకం ద్వారా ఆనాటి సామాజిక సమస్యలను ఎత్తిచూపారని పేర్కొన్నారు. గురజాడ స్ఫూర్తితో సమాజంలో సమానత్వం, చైతన్యం, మానవతా విలువల పెంపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో సెట్నెల్‌ సీఈఓ నాగేశ్వరరావు, టూరిజం అధికారి ఎస్‌కే అలీ, మెప్మా పీడీ కిరణ్‌కుమార్‌, సంగీత కళాశాల ప్రిన్సిపల్‌ పినాకపాణి, ఏఓ చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement