మొసలి కోసం గాలింపు | - | Sakshi
Sakshi News home page

మొసలి కోసం గాలింపు

Aug 27 2026 12:12 AM | Updated on Aug 27 2026 12:12 AM

ముత్తుకూరు(పొదలకూరు): మండలంలోని కృష్ణపట్నం పంట కాలువలో మొసలి సంచరిస్తోందనే అంశాన్ని రైతులు మంగళవారం రాత్రి గుర్తించి.. అధికారులకు తెలియజేశారు. ఈ క్రమంలో అటవీ, పోలీస్‌ శాఖల అధికారులు, సిబ్బంది గాలింపు చర్యలను బుధవారం చేపట్టారు. రెండు డ్రోన్లను ఉపయోగించి పంట కాలువ మొత్తాన్ని గాలించారు. అయినా ఆచూకీ తెలియకపోవడంతో ఎట్టి పరిస్థితుల్లో కాలువల్లోకి దిగడం లేక చెరువుల్లోకి వెళ్లొద్దని సూచించారు. ముత్తుకూరు చెరువు వెంట నివసించే వారు తమ చిన్నారులను జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు. ఎవరైనా గుర్తిస్తే వెంటనే 112 లేదా ముత్తుకూరు సీఐ, ఎస్సైకు సమాచారమివ్వాలని పేర్కొన్నారు.

సీఓఈ శిక్షణ కేంద్రంలో

పరిశీలన

కోట: స్థానిక ఎస్సీ గురుకుల పాఠశాలను సీఓఈ (సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌) శిక్షణ కేంద్రంగా మార్పు చేసిన క్రమంలో ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను గురుకులాల అసిస్టెంట్‌ జాయింట్‌ సెక్రటరీ శ్రీదేవి బుధవారం పరిశీలించారు. ఇక్కడ నీట్‌, ఐఐటీ కోసం శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రూ.20 లక్షలతో తరగతి గదులను అధునాతనంగా తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేసి త్వరలో శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించనున్నామని ప్రకటించారు. డీసీఓ ప్రభావతి, ప్రిన్సిపల్స్‌ వెంకటేశ్వర్లు, ఆనందరావు పాల్గొన్నారు.

శ్రీవారి దర్శనానికి

18 గంటలు

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ బుధవారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోయి.. కృష్ణతేజ అతిథి గృహం వద్దకు క్యూ చేరుకుంది. స్వామివారిని 73,285 మంది మంగళవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 32,334 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.39 కోట్లను సమర్పించారు. టైమ్‌ స్లాట్‌ టికెట్లున్న వారికి సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లున్న వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. కాగా సర్వదర్శన టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది.

సివిల్‌ సప్లయ్స్‌ డీఎం బదిలీ

నెల్లూరు(పొగతోట): సివిల్‌ సప్లయ్స్‌ సంస్థ డీఎం అర్జున్‌రావును అన్నమయ్య జిల్లా డీఎంగా బదిలీ చేశారు. పార్వతీపురం నుంచి శ్రీనివాస్‌ను ఇక్కడ నియమించారు. కాగా డీఎంగా అర్జున్‌రావు బాధ్యతలు చేపట్టి ఏడాదిన్నర దాటింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement