● రూ.40 లక్షల నష్టం
వాకాడు: మరో నాలుగు రోజుల్లో పంట చేతికొస్తుందని ఆశపడిన అన్నదాతలకు గాలివాన గుండెకోతను మిగిల్చింది. మండలంలోని పలు ప్రాంతాల్లో 48 మంది రైతన్నలకు సంబంధించిన దాదాపు 70 ఎకరాల్లో ఇటీవల కురిసిన వర్షం కంటతడిని మిగి ల్చింది. దీంతో పంట నేలవాలి పాచిపోతోంది. మండలంలో ప్రస్తుతం 1800 ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. తొలిదశలో 709 ఎకరాల్లో కోతలను పూర్తి చేశారు. ఈ నెలాఖరు నాటికి పూర్తి కావాల్సిన రెండో దశ మొత్తం నేలవాలి పనికిరాకుండా పొతోంది. దాదాపు రూ.40 లక్షల నష్టం వాటిల్లిందని వాపోతున్నారు. వర్షం కొందరికి ఊరట కలిగించగా, అధిక శాతం మందికి నష్టాన్నే మిగిల్చింది.


