రాపూరు: కండలేరు జలాశయంలో సోమవారం నాటికి 20.95 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జలాశయం ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 2,000, లోలెవల్ కాలువకు 10, హైలెవల్ కాలువకు 50, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్ కాలువకు 60 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
వైభవంగా ప్రాకారోత్సవం
నెల్లూరు(బృందావనం): మూలాపేటలోని భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం రాత్రి స్వామివార్లకు చిన్నరథంపై ప్రాకారోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. తొలుత స్వామికి సంప్రదాయంగా అభిషేక, అర్చనలు విశేషంగా చేశారు. శ్రీవార్ల సేవా సమితి, భక్తబృందం ఆధ్వర్యంలో కోలాటాలతో నిర్వహించిన ప్రాకారోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. కార్యక్రమాలను కార్యనిర్వహణాధికారి అర్వభూమి వెంకటశ్రీనివాసులురెడ్డి పర్యవేక్షించారు.


