పాస్‌ పుస్తకాలు మీ వద్ద ఎందుకు? | - | Sakshi
Sakshi News home page

పాస్‌ పుస్తకాలు మీ వద్ద ఎందుకు?

Aug 21 2026 12:16 AM | Updated on Aug 21 2026 12:16 AM

వీఆర్వో, సర్వేయర్‌ తీరుపై రైతుల మండిపాటు

కోవూరు: భూ సమస్యల పరిష్కారానికి నిర్వహించిన గ్రామసభ రసాభాసగా మారింది. భూ రికార్డుల సవరణలు, రీ సర్వేలో నెలకొన్న సమస్యలపై రైతులు అధికారులను నిలదీశారు. అధికారులు తమ ఇబ్బందులను మరింత పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విడవలూరు మండలంలోని ముదివర్తి గ్రామంలో గురువారం వన్‌ మంత్‌ – వన్‌ విలేజ్‌ కార్యక్రమం జరిగింది. ఇందులో రైతులు, అధికారుల మధ్య వాదోపవాదనలు జరిగాయి. వీఆర్వో, గ్రామ సర్వేయర్‌ల పనితీరుపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భూములకు సంబంధించిన పాస్‌ పుస్తకాలు, ఇతర రికార్డులను అధికారులు తమ వద్ద ఎందుకు ఉంచుకున్నా రని రైతులు ప్రశ్నించారు. పాస్‌ పుస్తకాల విషయంలో ఇబ్బందులకు గురిచేస్తున్నారని, పనులు చేయించుకోవాలంటే కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. రీ సర్వేలో అనేక తప్పులు చోటుచేసుకున్నాయని, భూముల విస్తీర్ణం, హద్దులు,యాజమాన్య వివరాల్లో లోపా లు ఏర్పడటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. టీడీపీ నా యకులు ఎస్‌కే రఫీ, ఇమామ్‌బాషా మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయా ల్సిన అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం సరికాదన్నారు.

అధికారులను నిలదీస్తున్న రైతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement