వెంకటాచలం: విద్యార్థులు వినూత్న ఆలోచనలతో ముందుకు సాగాలని విక్రమసింహపురి యూనివర్శిటీ వీసీ అల్లం శ్రీనివాసరావు సూచించారు. మండలంలోని కాకుటూరు వద్దనున్న వీఎస్‌యూలో సస్టైనబుల్ బయో ఇన్నోవేషన్‌పై హ్యాకథాన్‌ను శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, లైఫ్‌సైన్సెస్ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో విద్యార్థులు వినూత్న ఆలోచనలతో ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. సమాజానికి, పర్యావరణానికి ఉపయోగపడే సుస్థిర పరిష్కారాలను రూపొందించడంలో యువత కీలకపాత్ర పోషించాలని సూచించారు. పరిశోధన, సృజనాత్మకత, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమన్వయం చేసుకుని నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జీ విజయానంద్‌కుమార్‌బాబు, డాక్టర్ మేరీ సందీప, డాక్టర్ విద్యాప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.


