స్వాతంత్య్ర వేడుకలకు ముస్తాబు | - | Sakshi
Sakshi News home page

స్వాతంత్య్ర వేడుకలకు ముస్తాబు

Aug 15 2026 2:03 AM | Updated on Aug 15 2026 2:03 AM

నెల్లూరు(క్రైమ్‌): నెల్లూరు నగరంలోని పోలీసు కవాతు మైదానం శనివారం జరిగే 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబైంది. పోలీసు వందనం స్వీకరణ, శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల వేడుకల సన్నాహక ఏర్పాట్లను పరిశీలించారు. కవాతు రిహార్సల్స్‌ను వీక్షించి భద్రతాపరంగా తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి సూచనలు చేశారు. వేడుకలను ఎలాంటి లోపాలకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్‌ సౌజన్య, ఏఆర్‌ ఏఎస్పీ అప్పారావు, నెల్లూరు రూరల్‌, డీటీసీ, మహిళా, ఏఆర్‌ డీఎస్పీలు ఘట్టమనేని

శ్రీనివాసరావు, గిరిధర్‌, కె.వేమారెడ్డి, చంద్రమోహన్‌, సీఐలు, ఆర్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement