వెంకటాచలం: విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం పరిధిలోని యూనివర్సిటీ కళాశాలలో 2026 – 27 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైనట్లు వర్సిటీ ప్రవేశాల సంచాలకుడు డాక్టర్ హనుమారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాలు, కోర్సులు, అర్హతలు, దరఖాస్తు విధానం తదితర సమాచారం కోసం వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలియజేశారు.
రైలు కింద పడి
వ్యక్తి ఆత్మహత్య
నెల్లూరు(వీఆర్సీసెంటర్): రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. రైల్వే ఎస్సై హరిచందన కథనం మేరకు.. వెంకటాచలం – వేదాయపాళెం రైల్వేస్టేషన్ల మధ్య హౌసింగ్‌బోర్డు కాలనీ సమీపంలో ఓ వ్యక్తి రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి వివరాలు తెలిసిన వారు 92475 75628 ఫోన్ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని ఎస్సై కోరారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించి కేసు నమోదు చేశారు.


