సరుకులు కొనేందుకు వెళ్తూ.. | - | Sakshi
Sakshi News home page

సరుకులు కొనేందుకు వెళ్తూ..

Aug 6 2026 1:15 AM | Updated on Aug 6 2026 1:15 AM

స్కూటీని ఢీకొట్టిన లారీ

భర్త కళ్లెదుటే భార్య మృతి

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): భార్యాభర్తలిద్దరూ సరుకులు కొనుగోలు చేసేందుకు స్కూటీపై బయలుదేరారు. లారీ మృత్యువు రూపంలో వచ్చి భార్య ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన బుధవారం కొత్తూరు సమీపంలో జరిగింది. సౌత్‌ ట్రాఫిక్‌ పోలీసుల కథనం మేరకు.. కొత్తూరు ప్రాంతానికి చెందిన జయపాలన్‌ సెంట్రింగ్‌ పనులు చేస్తుంటాడు. అతను సరుకులు కొనేందుకు తన భార్య లక్ష్మి (34)తో కలిసి స్కూటీపై నెల్లూరు నగరానికి బయలుదేరారు. వీరు లాల్‌బహదూర్‌శాస్త్రి నగర్‌ (ఎల్‌బీఎస్‌ నగర్‌) మెయిన్‌రోడ్డుపై వెళ్తుండగా పొదలకూరు నుంచి నెల్లూరు వైపు వస్తున్న లారీ స్కూటీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో దంపతులు కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించగా లక్ష్మి మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న సౌత్‌ ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement