వింజమూరు(ఉదయగిరి)/వరికుంటపాడు: వింజమూరు మండలం ఊటుకూరు, వరికుంటపాడు మండలం జడదేవిలో జరుగుతున్న వీబీజీరాంజీ పథకం పనులను డ్వామా పీడీ శ్రీనివాసరావు బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కూలీలతో ముఖాముఖి మాట్లాడారు. కూలీలకు అందుతున్న కూలి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం రోజుకు సుమారు రూ.240 కూలి వస్తోందని కూలీలు తెలిపారు. స్పందించిన పీడీ గరిష్టంగా రూ.300 వరకు వేతనం పొందే అవకాశం ఉందన్నారు. రోజుకు రూ.300 వరకు కూలి వచ్చేలా అవసరమైతే మరో గంట అదనంగా పనిచేసి రోజువారీ కూలిని పెంచుకోవాలని సూచించారు. కూలీలు గత 7,8 వారాలకు సంబంధించిన వేతనాలు అందలేదని విన్నవించగా త్వరలో విడుదల చేస్తామని తెలిపారు.ఆయన వెంట ఏపీఓలు శ్రీనివాసరావు, అజాంఖాన్, టీఏలు మురళి, రామ్మోహన్, మాల్యాద్రి, ఫీల్డ్ అసిస్టెంట్ మహేంద్ర ఉన్నారు.


