పొదలకూరు: జిల్లాలోని ఐదు రైతు బజార్లలో తక్కువ ధరలకు పప్పులు, నూనెలను విక్రయించనున్నామని మార్కెటింగ్ ఏడీ అనితాకుమారి పేర్కొన్నారు. స్థానిక రైతు బజార్‌లో పప్పుల అమ్మకాలను మంగళవారం ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. జిల్లాలో ని అసోసియేషన్లతో జేసీ వెంకటేశ్వర్లు సంప్రదింపులు జరిపి పప్పు లు, నూనెలను బహిరంగ మార్కెట్ కంటే తక్కు వగా అందజేసేలా ఏర్పాటు చేశారని చెప్పారు. బియ్యం, కందిపప్పు, మినపప్పు, పామాయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. బియ్యంపై రూ.10, కందిపప్పు పై రూ.70, మినపప్పుపై రూ.ఏడు, నూనెలపై రూ.పది మేర తగ్గించి విక్రయించనున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా ఉద్యానాధికారి సుబ్బారెడ్డి, సొసై టీ చైర్మన్ మస్తాన్‌బాబు, నెల్లూరు, పొదలకూరు ఏఎమ్సీ సెక్రటరీలు శ్రీనివాసు లు, కృష్ణప్రసాద్, మల్లికార్జున్‌నాయుడు, ఏఎమ్సీ డైరెక్టర్లు అనూరాధ, రామలింగయ్య తదితరులు పాల్గొన్నారు.


