జిల్లాలో గిరిజన యానాదుల మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలి. సంగం మండలం గాంధీగిరిజన మత్స్యకార సొసైటీని ట్రేడింగ్ లైసెన్స్‌గా మార్చాలి. అక్కడి మత్స్యకారులు ప్రతి సంవత్సరం రూ.14 లక్షలు లీజు చెల్లించాల్సి వస్తుండటంతో లాభాలు రావడం లేదు. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రేడింగ్ లైసెన్స్ మార్చితే ఉపయోగం ఉంటుంది. అలాగే మనుబోలు మండలం పిడూరు మత్స్యకార సొసైటీలో గిరిజన యానాదులకు నూతనంగా సభ్యత్వం ఇవ్వడంతోపాటు చేపలు పట్టుకునేలా చర్యలు చేపట్టాలి.
– కేసీ పెంచలయ్య,
యానాది సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, రమణయ్య, వెంకయ్య


