నిమ్మ ధరలు (కిలో) | - | Sakshi
Sakshi News home page

నిమ్మ ధరలు (కిలో)

Jul 21 2026 12:05 AM | Updated on Jul 21 2026 12:05 AM

ఆస్తి తీసుకుని.. గుండైపె తన్ని..

కుమారుడు వీధిపాలు చేశాడని

వృద్ధుడి ఆవేదన

న్యాయం కోసం తహసీల్దార్‌కు వినతి

అనుమసముద్రంపేట: ఓ తండ్రి కుమారులకు ఆస్తులు పంచి ఇచ్చాడు. అయితే చిన్న కుమారుడు మోసం చేసి మిగిలిన ఆస్తిని సైతం రాయించుకుని ఇంటి నుంచి వెళ్లగొట్టాడంటూ సోమవారం ఏఎస్‌పేట తహసీల్దార్‌ కార్యాలయంలో కన్నీటి పర్యంతమయ్యాడు. అనుమసముద్రం గ్రామానికి చెందిన సోము హజరత్‌రెడ్డి ఇన్‌చార్జి తహసీల్దార్‌ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వివరాలు వెల్లడించారు. ముగ్గురు కుమారులకు వివాహాలు చేసి ఒక్కొక్కరికి ఏడెకరాల చొప్పున భూమి పంచి ఇచ్చానని తెలిపారు. చిన్న కుమారుడు రమణారెడ్డి, కోడలు జీవితాంతం చూసుకుంటామని చెప్పి తన వద్ద ఉన్న ఒక ఎకరా భూమి, 150 అంకణాల స్థలం, ఏడు సవర్ల బంగారం రాయించుకున్నారని చెప్పారు. కొంతకాలానికే దాడి చేసి ఇంటి నుంచి వెళ్లగొట్టారని, ఆవేదనతో ఆత్మహత్యకు కూడా ప్రయత్నించానని వృద్ధుడు కన్నీటి స్వరంతో వివరించారు. పెద్ద కుమారుడు ప్రస్తుతం తనకు ఆశ్రయం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. చిన్నకుమారుడి నుంచి భూమిని ఇప్పించి తన పేరుపై రిజిస్ట్రేషన్‌ చేయించాలని కోరారు.

పెద్దవి : రూ.55

సన్నవి : రూ.25

పండ్లు : రూ.10

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement