● పోలీసుల దృష్టికి తీసుకెళ్లిన వృద్ధుడు
● పీజీఆర్‌ఎస్‌కు 161 వినతులు
నెల్లూరు(క్రైమ్): నేను వృద్ధాప్యంలో ఉన్నాను. పెద్ద కుమారుడు తరచూ వేధిస్తూ ఇల్లు ఖాళీ చేసి వెళ్లాలంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. తగిన చర్యలు తీసుకోవాలని వింజమూరుకు చెందిన ఓ వ్యక్తి కోరాడు. నెల్లూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా వ్యాప్తంగా 161 మంది తమ సమస్యలను వినతుల రూపంలో ఎస్పీ అజిత వేజెండ్లకు అందజేశారు. వాటిని పరిశీలించిన ఆమె ఆయా ప్రాంత పోలీస్ అధికారులతో మాట్లాడారు. చట్టపరిధిలో విచారణ జరిపి పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీ కె.వేమారెడ్డి, ఇన్‌స్పెక్టర్‌లు టీవీ సుబ్బారావు, భక్తవత్సలరెడ్డి, దశరథ రామారావు, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


