వైద్య ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
● హంస అసోసియేషన్ నాయకులు
నెల్లూరు(అర్బన్): జిల్లా వైద్యారోగ్య శాఖలో దీర్ఘకాలంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏపీ హంస అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చేజర్ల సుధాకర్‌రావు, కమల్ కిరణ్ డిమాండ్ చేశారు. మంగళవారం నెల్లూరులోని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో డీఎంహెచ్‌ఓ సుజాతకు నాయకులు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేసి సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా సుధాకర్‌రావు మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలను పూర్తి చేయాలన్నారు. ఉద్యోగుల మెడికల్ బిల్లులు, ఇంక్రిమెంట్లు, ఇతర ఆర్థిక పరమైన బిల్లులు జాప్యం కాకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని కోరారు. డీఎంహెచ్‌ఓగా బాధ్యతలు చేపట్టిన సంవత్సరం కాలంలోనే అడ్మినిస్ట్రేషన్‌ను చక్కదిద్ది జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు రాష్ట్ర స్థాయిలో ముందుండేలా చేసినందుకు అభినందనలు తెలిపారు. అసోసియేషన్‌కు చెందిన నూతన సంవత్సరం క్యాలెండర్‌ను సుజాత ఆవిష్కరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ పబ్లిసిటీ సెక్రటరీ మజార్, జిల్లా ఉపాధ్యక్షులు మురళీకృష్ణ, నాగరాజు, సిటీ అధ్యక్ష, కార్యదర్శులు గౌస్‌బాషా, మంజరి, బుచ్చి తాలుకా సెక్రటరీ మాధవ, ఉపాధ్యక్షుడు ఉదయకిరణ్, ఇందుకూరుపేట తాలూకా అధ్యక్షురాలు అరుణరాణి పాల్గొన్నారు.


