ఎన్జీఓ అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం
● జిల్లా అధ్యక్షుడిగా బండారుపల్లి వెంకటేశ్వర్లు
నెల్లూరు(అర్బన్): ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ నెల్లూరు జిల్లా ఎన్నికలు మంగళవారం నెల్లూరులోని ఎన్జీఓ భవన్‌లో కోలాహలంగా జరిగాయి. ఈ ప్రక్రియ ఆ అసోసియేషన్ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు రాఘవులు పర్యవేక్షణలో జరిగింది. ఉదయం 10 గంటల నుంచి నామినేషన్లు స్వీకరించారు. అయితే జిల్లాలో ఉన్న 17 పదవులకు గానూ 17 మంది మాత్రమే నామినేషన్లు వేశారు. పోటీ లేకపోవడంతో ఎన్నికలు ఏకగ్రీవమైనట్టు రాఘవులు ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా బండారుపల్లి వెంకటేశ్వర్లు, సహాధ్యక్షుడిగా ఆంజనేయవర్మ, ఉపాధ్యక్షులుగా రాజేంద్రప్రసాద్, కిరణ్‌కుమార్, సతీష్‌బాబు, జనార్దన్‌రావు, మల్లికార్జునరావు, మహిళా ఉపాధ్యక్షురాలిగా కరుణమ్మ, జిల్లా కార్యదర్శిగా గాదిరాజు రామకృష్ణ, కార్యనిర్వహణ కార్యదర్శిగా లక్కాకుల పెంచలయ్య, సంయుక్త కార్యదర్శిగా రవికుమార్, గిరిధర్, వీరబ్రహ్మేశ్వరరావు, సురేష్, రాజేంద్ర, మహిళా సంయుక్త కార్యదర్శిగా రమ్య, కోశాధికారిగా వీఎంవీ ప్రసాద్‌రెడ్డి నియమితులయ్యారు. వీరితో ఎన్నికల అధికారి ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో సహాయ ఎన్నికల అధికారి, ఎన్జీఓ అసోసియేషన్ చిత్తూరు జిల్లా కార్యదర్శి కె.రమేష్, పర్యవేక్షుడు జగదీష్ పాల్గొన్నారు.


