
ఉచిత బస్సు ‘కొందరికే’
నెల్లూరు ఒంగోలు మధ్య ఎక్స్‌ప్రెస్‌లు లేవు. అన్నీ డీలక్స్, సూపర్ డీలక్స్ బస్సులే. ఉన్న ఎక్స్‌ప్రెస్‌లు కావలి–నెల్లూరు మధ్య తిరిగే నాన్‌స్టాప్ బస్సులే. వీటిల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతి లేదు. మహిళలు ఎవరైనా ఒంగోలుకు వెళ్లాంటే పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు బస్సులో కావలి వరకు వెళ్లి.. అక్కడి నుంచి మరో బస్సులో ఒంగోలుకు వెళ్లాల్సి ఉంటుంది. నెల్లూరు నుంచి కందుకూరు వెళ్లాలన్నా.. ఇదే పరిస్థితి.
నెల్లూరు నుంచి గూడూరుకై నా పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు బస్సులు ఉన్నాయి. నాయుడుపేట, సూళ్లూరుపేటకు వెళ్లాంటే నేరుగా ఆర్డినరీ బస్సులు కూడా లేవు. కనీసం గూడూరు నుంచి కూడా ఆర్డినరీలు లేవు.
●నెల్లూరు ఒంగోలు మధ్య ఎక్స్‌ప్రెస్‌లు లేవు. అన్నీ డీలక్స్, సూపర్ డీలక్స్ బస్సులే. ఉన్న ఎక్స్‌ప్రెస్‌లు కావలి–నెల్లూరు మధ్య తిరిగే నాన్‌స్టాప్ బస్సులే. వీటిల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతి లేదు. మహిళలు ఎవరైనా ఒంగోలుకు వెళ్లాంటే పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు బస్సులో కావలి వరకు వెళ్లి.. అక్కడి నుంచి మరో బస్సులో ఒంగోలుకు వెళ్లాల్సి ఉంటుంది. నెల్లూరు నుంచి కందుకూరు వెళ్లాలన్నా.. ఇదే పరిస్థితి.
●నెల్లూరు నుంచి గూడూరుకై నా పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు బస్సులు ఉన్నాయి. నాయుడుపేట, సూళ్లూరుపేటకు వెళ్లాంటే నేరుగా ఆర్డినరీ బస్సులు కూడా లేవు. కనీసం గూడూరు నుంచి కూడా ఆర్డినరీలు లేవు.
నెల్లూరు సిటీ: కూటమి ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించనున్న పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ‘కొందరికే’ ఉపయోగపడుతోంది. ఎక్స్‌ప్రెస్‌ల్లో ఉచితం అంటూనే నాన్‌స్టాప్‌గా నడిచే ఎక్స్‌ప్రెస్‌ల్లో ‘నో ఫ్రీ’ అంటూ కొర్రీలు పెట్టింది. ప్రస్తుతానికి నిబంధనలు ఇవే ఉన్నప్పటికీ.. ప్రారంభించే సమయానికి ఇంకెన్నీ కండీషన్లు ఉంటాయోనని చర్చ ఆర్టీసీ అధి కారులు, ఉద్యోగుల్లోనూ ఉంది. మరో మూడు రోజుల్లో ఉచిత బస్సును ప్రారంభించాల్సి ఉన్నా.. ఇంతవరకు అధికారులకు మార్గదర్శకాలు రాలేదు.
70 శాతం బస్సుల్లో అనుమతి ఉన్నా..
జిల్లాలో నెల్లూరు–1, నెల్లూరు–2, ఆత్మకూరు, కందుకూరు, కావలి, రాపూరు, ఉదయగిరిలో మొత్తం 7 డిపోలు ఉన్నాయి. ఆయా డిపోల్లో 642 బస్సులు వివిధ మార్గాల్లో నడుస్తున్నాయి. అయితే ఇందులో 341 పల్లెవెలుగు, 31 అల్ట్రా పల్లెవెలుగు, 52 ఎక్స్‌ప్రెస్‌లు కలిపి 424 (70 శాతం) బస్సుల్లోనే మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు చెబుతున్నప్పటికీ ఎక్స్‌ప్రెస్ కేటగిరీల్లోని నాన్‌స్టాప్ బస్సుల్లో అనుమతి లేకపోవడం వల్ల పెద్దగా ఒరిగేమీ ఉండదు. పట్టణాల నుంచి పల్లెలకు ఉండేవి, నడిచేవి పల్లె వెలుగులు మాత్రమే. ప్రధానంగా నెల్లూరు నుంచి కావలి, గూడూరు, ఆత్మకూరు మార్గాల్లో పల్లె వెలుగుతోపాటు అల్ట్రా పల్లెవెలుగు బస్సులు ఉన్నాయి. ఎక్కువగా ప్రయాణికులు నాన్‌స్టాప్ బస్సులనే ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఈ ఉచిత ప్రయాణం అందరికీ ఉపయోగపడే పరిస్థితి లేదని స్పష్టమవుతోంది.
అదనంగా 30 బస్సుల కేటాయింపు
ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు 30 బస్సులను మాత్రమే అదనంగా కేటాయించారు. బడి బస్సులు 25, మరో 5 బస్సులను కేటాయించారు. గత ఆరు నెలల నుంచి ఆర్టీసీ అధికారుల నుంచి ప్రభుత్వం దశల వారీగా జిల్లాలో ఎన్ని బస్సులు అవసరం? ఎంత మంది డ్రైవర్‌లు, కండెక్టర్లు అవసరమో అడుగుతూ వచ్చింది. దీంతో అధికారులు సూచించిన మేరకు బస్సులు కేటాయింపు జరగకపోవడంతో ఫ్రీ బస్సు సర్వీసులను ఎలా నిర్వహించాలో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.
డొక్కు బస్సుల్లోనే ప్రయాణం
ప్రతి రోజూ జిల్లాలో బస్సుల్లో 1.50 లక్షల నుంచి 1.70 లక్షలు మందికిపైగా ప్రయాణికులు వివిధ ప్రాంతాల కు రాకపోకలు సాగిస్తుంటారు. మహిళలు 70 వేల నుంచి 80 వేలు వరకు బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం జిల్లాలో ఉన్న 642 బస్సుల్లో 15 లక్షల కి.మీ. తిరిగిన బస్సులు 100 ఉండగా, 10 లక్షలు కి.మీ. తిరిగిన బస్సులు 200 వరకు ఉన్నాయి. కొత్త బస్సులు 100 ఉండగా, 200 బస్సులు కండీషన్‌లో ఉన్నాయి. కండీషన్‌లో లేని బస్సుల్లో ఎక్కువ శాతం పల్లెవెలుగు బస్సులు కావడం గమనార్హం. ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసిన తరువాత ఎక్కువ మంది మహిళా ప్రయాణికులు పెరిగే అవకాశం ఉంది. అయితే ఆ బస్సుల్లో లోడ్ పెరగడం ద్వా రా బస్సుల పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో ప్రయాణం సజావుగా సాగేనా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మూలన పడేందుకు సిద్ధంగా ఉన్న బస్సులకు రంగులు అద్ది రోడ్ల పైకి తీసుకు వస్తున్నారు.
100 మంది ఆన్‌కాల్ డ్రైవర్ల నియామకం
జిల్లాలో డ్రైవర్లు 1,119, కండక్టర్లు 923 మంది ఉన్నారు. వీరు కాకుండా 110 మంది ఆన్‌కాల్ డ్రైవర్స్ ఉన్నారు. అయితే కొత్తగా మరో 100 మంది ఆన్‌కాల్ డ్రైవర్స్‌ను అధికారులు నియామకం చేసుకుంటున్నారు. అయితే ఆన్‌కాల్ డ్రైవర్స్ నియమించుకునే క్రమంలో వారి పూర్తిస్థాయి డ్రైవింగ్‌పై అనుభవాన్ని పరీక్షిస్తున్నారు. గతంలో లారీలు, ప్రైవేట్ బస్సులు, భారీ వాహనాలు నడిపిన అనుభవం ఉంది. అయితే ఆయా డ్రైవర్లు వందల మంది ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వాహనాలు నడుపుతారా అనే సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. పాత, తుప్పు పట్టిన బస్సులకు పసుపు రంగులు వేసి కలరింగ్ చేస్తున్నారు.
విద్యార్థులు, ఉద్యోగులకు తిప్పలు తప్పవా?
ప్రతి రోజూ ఉదయాన్నే విద్యార్థులు పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లేందుకు, ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు సర్వీసులను ఆశ్రయిస్తుంటారు. అయితే మహిళలకు ఉచిత ప్రయాణం నేపథ్యంలో ఒక్కసారిగా మహిళలు అధికంగా ఎక్కితే ఉదయం, సాయంత్రం సమయాల్లో విద్యార్థులు, ఉద్యోగులకు సీట్లు దొరికే పరిస్థితి ఉండదు. దీంతో అధికారులు ఏమి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంటుంది.
పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు,
ఎక్స్‌ప్రెస్‌ల్లోనే అవకాశం
నాన్‌స్టాప్‌ల్లో ఉచిత ప్రయాణం లేదంట
మరో మూడు రోజులే ఉన్నా.. ఇంకా అందని మార్గదర్శకాలు
మల్లగుల్లాలు పడుతున్న ఆర్టీసీ అధికారులు
బస్సులను కండీషన్‌లో ఉంచుతాం
ఈ నెల 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. బస్సులను కండీషన్‌లోఉండేలా చూసుకుంటున్నాం. ఇంకా ఉచిత ప్రయాణానికి సంబంధించి మార్గదర్శకాలు అందలేదు. వచ్చిన వెంటనే కార్యాచరణ చేపడుతాం.
– షేక్ షమీమ్, జిల్లా ప్రజా రవాణాశాఖ అధికారి