
తిరంగా.. మదినిండా..
నెల్లూరు(అర్బన్): స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పెహల్గాం ఘటనపై కోవూరు జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన 70 మంది విద్యార్థినులు ప్రదర్శన ఇచ్చారు. కావలి ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల బాలికల జయహో.. జయహో, నగరంలోని ఎస్‌ఆర్‌కే నెక్ట్స్ జనరేషన్ ఇస్కాన్ సిటీ ఉన్నత పాఠశాల విద్యార్థుల హమ్ ఇండియా వాలా ప్రదర్శనలు దేశ గొప్పతనాన్ని చాటాయి.
● విద్యాశాఖ శకటం ప్రథమ బహుమతి, నెల్లూరు నగరపాలక సంస్థ శకటం రెండో స్థానం, వ్యవసాయ అనుబంధ శాఖ శకటం తృతీయ స్థానంలో నిలిచాయి.
● ఆత్మకూరు, కావలి, కందుకూరు డివిజన్లకు సంబంధించిన 55 మంది మాజీ సైనికులకు 180 ఎకరాల అసైన్డ్ భూములను పట్టాలుగా అందజేశారు.
● వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి నారాయణ, కలెక్టర్ ఆనంద్, జేసీ కార్తీక్, ఎస్పీ కృష్ణకాంత్ తదితరులు పరిశీలించారు.
● డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో 10 మంది చిరు వ్యాపారులకు చేయూతనిచ్చారు. అలాగే ఐటీడీఏ ఆధ్వర్యంలో కుట్టుమెషీన్లు, జ్యూట్ బ్యాగ్ కుట్టుమెషీన్లు, చేపలు పట్టేవారికి సైకిళ్లు, వలలు పంపిణీ చేశారు.

తిరంగా.. మదినిండా..

తిరంగా.. మదినిండా..

తిరంగా.. మదినిండా..

తిరంగా.. మదినిండా..